/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/rr-1-jpg.webp)
Modi to be Sworn as the Prime Minister on June 8: జూన్ 8న ప్రధానిగా మూడవ సారి నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించి బీజేపీ విశ్వసనీయవర్గాలు న్యూస్ 18తో చెప్పినట్టు తెలుస్తోంది. జూన్ 8 సాయంత్రం మోదీ మూడవసారి భారత ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారని చెబుతున్నారు. ఇక అదే రోజు మోదీతో పాటు ఇతర మంత్రులు కూడా ప్రమాణం చేస్తారని తెలుస్తోంది. ఇక ఢిల్లీ కర్తవ్యపథ్ లో మోదీ ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు కూడా చేసేస్తున్నరిన అంటున్నారు. మోదీ లక్కీ నంబర్ 8 కావడం వల్లనే ఆరోజు ప్రమాణస్వీకారానికి ముహూర్తం పెట్టారని చెప్పాయి బీజేపీ వర్గాలు. 2014లో మే 26న ప్రధానిగా మోదీ (Narendra Modi) మొదటిసారి ప్రమాణం చేశారు. ఇక్కడ 2+6=8 అయింది. అలాగే 2016 నవంబర్ 8న నోట్ల రద్దు ప్రకటన చేశారు.ఇక ఇప్పుడు ఈ నెల 8న ముచ్చటగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టనున్నారు మోదీ.
ముచ్చటగా మూడవసారి..
ఇదే కనుక నిజమైతే భారతదేశంలో వరుసగా మూడుసార్లు ప్రధానిగా ప్రమాణం చేసిన రెండవ మంత్రిగా మోదీ చరిత్ర సృష్టించనున్నారు. నెహ్రూ తర్వాత మోదీనే మూడుసార్లు ప్రధాని బాధ్యతలు చేపట్టినవారు అవుతారు. ప్రధానిమోదీ ఉత్తరప్రదేశ్ లోని వారణాసి నుంచి పోటీ చేశారు. కాంగ్రెస్ అభ్యర్థి అజయ్ రాయ్‌ను 1.5 ఓట్లతో తేడాతో మోదీ ఓడించారు. దీంతో వారణాసి నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచిన నేతగా కూడా మోదీ నిలవనున్నారు. అయితే ఈసారి బీజేపీ పార్టీ గవర్నమెంట్‌ను ఫామ్ చేయాలంటే 272 సీట్లు కావల్సి ఉండగా..ఆ పార్టీ కేవలం 240 మాత్రమే గెలుచుకుంది. దీంతో బీజేపీకి 32 సీట్లు తక్కవగా ఉన్నాయి. ప్రస్తుతం వీటిని పూరించడానికి ఆ పార్టీ పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నారు. మిత్ర పక్షాలు అయిన టీడీపీ, జేడీయూ నేతలతో సంప్రదింపులు జరపనున్నారు.