ఈనెల 8న తెలంగాణకి ప్రధాని మోదీ

ప్రధాని మోదీ వరంగల్ పర్యటన, విజయ్ సంకల్ప్ సభను పురస్కరించుకుని.. బీజేపీ నేతలు ఇవాళ హనుమకొండలో సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నారు. కేంద్రమంత్రి కిషన్​రెడ్డితో సహా పార్టీ ముఖ్యనేతలు ఈ సమావేశానికి హాజరుకానున్నారు. బహిరంగ సభకు ఏర్పాట్లు.. జన సమీకరణపై నేతలు చర్చించనున్నారు తెలంగాణ బీజేపీ నేతలు.

New Update
ఈనెల 8న తెలంగాణకి ప్రధాని మోదీ

Modi will be the PM of Telangana on 8th of this month

ఏర్పాట్లలో నిమగ్నమైన బీజేపీ శ్రేణులు

రాష్ట్రంలో ఈ ఏడాది శాసనసభ ఎన్నికలు జరగనుండటంతో.. బీజేపీ అగ్రనాయకులు తెలంగాణపై ఫోకస్​ పెట్టారు. ఈనెల 8న వరంగల్​లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. పలు దఫాలుగా వాయిదా పడుతున్న మోదీ పర్యటన ఎట్టకేలకు ఫైనల్​ కావడంతో రాష్ట్ర బీజేపీ శ్రేణులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. మోదీ వరంగల్ పర్యటన నేపథ్యంలో బీజేపీ శ్రేణులు ఏర్పాట్లను ముమ్మరం చేస్తున్నారు. కాజీపేట అయోధ్యాపురంలో పీరియాడిక్ ఓవర్ హాలింగ్ యూనిట్ పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయనున్నారు. ఇప్పటికే 160 ఎకరాల చుట్టూ ప్రహారిగోడ నిర్మాణం చేశారు. తాత్కాలిక కార్యాలయాలనూ ఏర్పాటు చేశారు. అలాగే 550 మీటర్ల పొడవుతో షెడ్ నిర్మాణం కోసం పనులు కొనసాగుతున్నాయి.

హనుమకొండలో సన్నాహక సమావేశం

కాజీపేట నుంచి అయోధ్యపురం మీదుగా పరిశ్రమల నిర్మాణ స్థలంకు రైలు పట్టాలు వేయడానికి కూడా పనులు జరుగుతున్నాయి. రెండు ఏళ్లలో షెడ్ నిర్మాణం పూర్తిగా అయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు. భూ సేకరణ పూర్తిచేసి రాష్ట్ర ప్రభుత్వం రైల్వేకు అప్పగించడంతో.. రైల్వే శాఖ టెండర్లు పిలిచి పనులను చకచకా ప్రారంభించింది. అయితే వేగన్ రిపేర్ వర్క్ షాప్ స్థానంలో.. కాజీపేట రైల్వే మాన్యుఫ్యాక్షరింగ్ యూనిట్​గా అప్ గ్రేడ్ చేస్తున్నట్లు కిషన్​రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. మోదీ రాకను పురస్కరించుకుని.. కిషన్​రెడ్డి నేడు హనుమకొండకు విచ్చేసి.. ముందుగా అయోధ్యాపురం వెళ్లి కాజీపేట రైల్వే యూనిట్ ప్రాంతాన్ని సందర్శిస్తారు. తర్వాత భూమిపూజ ఏర్పాట్లను పరిశీలిస్తారు. అనంతరం హనుమకొండలో నిర్వహించిన పార్టీ నేతల సన్నాహక సమావేశంలో పాల్గొంటారు.

ఘనంగా ఏర్పాట్లు

బండి సంజయ్, ఈటల రాజేందర్ ఇతర నేతలు.. జిల్లా నాయకులు ఈ సమావేశంలో పాల్గొని ప్రధాని పర్యటనకు, విజయ్ సంకల్ప్ సభకు చేయాల్సిన ఏర్పాట్లపై చర్చిస్తారు. వరంగల్​కు మొదటి సారి ప్రధాని రావడంతో ఘనంగా ఏర్పాట్లు చేసేందుకు నేతలు సన్నద్ధమౌతున్నారు. కర్ణాటక ఎన్నికలు తర్వాత పార్టీలో ఏర్పడిన స్దబ్దత, నేతల మధ్య అభిప్రాయభేదాలు, అధ్యక్షమార్పు ఊహాగానాలు ఈ గందరగోళాన్ని పోగొట్టి పార్టీ శ్రేణులను ఎన్నికలకు సమాయత్తం చేసేందుకు ప్రధాని పర్యటన దోహదపడేలా భారీ ఏర్పాట్లకు నేతలు సన్నద్ధమవుతున్నారు. అందుకు అవసరమైన కార్యాచరణను ఈ సన్నాహక సమావేశంలో చేపడతారు. దాదాపు 5 లక్షల మందితో భారీ సభ నిర్వహించి.. కమల దళం సత్తా చాటాలని.. అందుకు అవసరమైన ప్రణాళికలపై నేతలు చర్చించనున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు