TS POLITICS: తెలంగాణలో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న వేళ తమ రాజీనామాలతో బీజేపీకి వరుస షాకులు ఇస్తున్నారు ఆ పార్టీ నేతలు. ఇప్పటికే కొందరు ముఖ్య నేతలు బీజేపీలో తమకు సరైన గౌరవం లభించడం లేదని.. మరికొందరు నేతలు తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం కష్టమేనని చెప్పి ఆ పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలో చేరుతున్న విషయం తెలిసిందే. ఈ జాబితాలో కొత్తగా.. తనకు బీజేపీ నుంచి ఆశించిన వరంగల్ టికెట్ రాకపోవడంతో అసంతృప్తితో ఉన్న ఏనుగుల రాకేష్ రెడ్డి(Anugula Rakesh Reddy) బీజేపీకి రాజీనామా చేసి కేటీఆర్(KTR) సమక్షంలో BRS పార్టీలో చేరారు.
Also Read: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడబోతోంది: కేటీఆర్
ఇది ఇలా ఉంటె తాజాగా మరో ఇద్దరు ముఖ్యనేతలు బీజేపీకి రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మాజీ ఎంపీలు కొండా విశ్వేశ్వర్ రెడ్డి(Konda Vishweshwar Reddy), విజయశాంతి(Vijayashanti)లు గత కొంత కాలంగా బీజేపీలో అసంతృప్తితో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇటీవలే విజయశాంతి ట్విట్టర్(X)లో తనకు 25 సంవత్సరాల రాజకీయ ప్రయాణంలో అప్పుడు ఇప్పుడు కూడా ఎందుకో సంఘర్షణ మాత్రమే ఇస్తూ వచ్చింది అంటూ పోస్ట్ చేయడంతో ఈ వార్తలకు బలం చేకూరుంది. మరి విజయశాంతి, కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్టీ మారుతారో లేదో వేచి చూడాల్సి ఉంది.
Also Read: కేసీఆర్.. మీ అవినీతికి కాలం చెల్లింది.. షర్మిల ఫైర్!
వరుస నేతల రాజీనామాలతో బలం కోల్పోయిన బీజేపీకి బలం చేకూర్చేందుకు ఈ నెల 7న ప్రధాని నరేంద్ర మోడీ(Modi) తెలంగాణలో పర్యటించనున్నారు. ప్రచారంలో భాగంగా టీ-బీజేపీ నిర్వహించనున్న బీసీ బహిరంగ సభలో మోడీ పాల్గొననున్నారు. బీజేపీ గెలిస్తే బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిని చేస్తాము అని ఇటీవలే కేంద్రమంత్రి అమిత్ షా(Amit Shah) తెలంగాణ పర్యటనలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రధాని మోడీ రాకతోనైనా తెలంగాణలో బీజేపీ తలరాత మారుతుందో? లేదో? చూడాలి మరి.
RTV EXCLUSIVE: కాంగ్రెస్‌లోకి కొండా?