మూజువాణి ఓటుతో వీగిపోయిన అవిశ్వాస తీర్మానం

ప్రభుత్వంపై విపక్షకూటమి పెట్టిన అవిశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో వీగిపోయింది. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై సభలో మూడు రోజుల పాటు చర్చ జరిగింది. ఓటింగ్‌కు ముందే విపక్షాలు సభ నుండి వాకౌట్ చేశాయి.

మూజువాణి ఓటుతో వీగిపోయిన అవిశ్వాస తీర్మానం
New Update

వీగిపోయిన అవిశ్వాస తీర్మానం..

లోక్ సభలో నరేంద్ర మోదీ ప్రభుత్వంపై విపక్షకూటమి పెట్టిన అవిశ్వాస తీర్మానం మూజువాణి ఓటుతో వీగిపోయింది. కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై సభలో మూడు రోజుల పాటు చర్చ జరిగింది. బుధవారం రాహుల్ గాంధీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. ఇవాళ (గురువారం) ప్రధాని నరేంద్ర మోదీ సమాధానమిచ్చారు. ప్రధాని మాట్లాడుతుండగా.. ఓటింగ్‌కు ముందే విపక్షాలు సభ నుండి వాకౌట్ చేశాయి.

మణిపూర్లో శాంతిని పునరుద్ధరించటానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకుంటామని ప్రధాని మోదీ ప్రకటించారు. లోక్ సభలో అవిశ్వాస తీర్మానంపై చర్చలో ఆయన మాట్లాడారు. మణిపూర్ ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లటానికి అవసరమైన చర్యలను తీసుకుంటామని పేర్కొన్నారు. మణిపూర్ లో మహిళల పట్ల జరిగిన నేరం క్షమార్హమైనది కాదని ఆయన పేర్కొన్నారు. బాధితుల పక్షాన నిలబడతాం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిందితులకు కఠిన శిక్షలు అమలు చేయటానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.

మోదీ ప్రసంగంలో ఇంకా ఏమన్నారంటే..

ప్రతిపక్షాలకు ఆ ధైర్యం లేదు..

మణిపూర్ పైన చర్చలకు రావాలని ప్రతిపక్షాలను ఆహ్వానించాం. ఈమేరకు హోం మంత్రి లేఖ రాశారు. కానీ వారికి చర్చించాలన్న ఉద్దేశ్యం, ధైర్యం లేవు. అమిత్‌ షా తన సందేశంలో మణిపూర్ ప్రజలకు శాంతి సందేశం పంపారు.

వందేమాతరం గీతాన్ని ముక్కలు చేశారు..

వాళ్లు వందేమాతరం గీతాన్ని ముక్కలు ముక్కలు చేసిన వాళ్లు ఇందులో ఉన్నారు. వాళ్లు 'భారత్ తేరే తుక్డే హోంగె" నినాదాలు ఇస్తున్నారు. సిలిగురి దగ్గర ఉన్న చిన్న కారిడార్ని ధ్వంసం చేస్తే ఈశాన్యం విడిపోతుంది లాంటి మాటలు చెబుతున్నారు.

ఆ గాయాలను ప్రజలు మరిచిపోలేరు..

5 మార్చి 1956లో కాంగ్రెస్ పార్టీ అమాయకులపైన మిజోరం ప్రజలపై ఎయిర్ ఫోర్స్ ద్వారా దాడులు చేయించారు.ఆ గాయాలను ప్రజలు ఎప్పటికీ మరిచిపోలేరు.

సలహాలు ఇస్తారనుకున్నా అది లేదు..

కొన్నాళ్ల క్రితం మా ప్రభుత్వం మూడో దఫా అధికారంలోకి వచ్చినప్పుడు ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారుతుందని చెప్పాం. ప్రతిపక్షాలు నిజంగా బాధ్యతాయుతమయినదయితే, అది కొన్ని సలహాలను ఇచ్చి ఉండేది. అదేమీ లేకుండా ఇదంతా ఏ ప్రయత్నం లేకుండా
సాధ్యం అవుతుందన్న చందంగా అవి వ్యవహరించాయి.

స్కామ్ లు లేని ప్రభుత్వం మాది..

ఈ దేశ యువతకు స్కామ్ రహిత ప్రభుత్వాన్ని అందించాం. వాళ్లకు ధైర్యాన్ని, అవకాశాలను అందించాం.

ప్రభుత్వ కంపెనీల్లో పెట్టుబడి పెట్టండి

స్టాక్ మార్కెట్ అంటే ఆసక్తి ఉంటే, ప్రభుత్వ కంపెనీల్లో పెట్టుబడి పెట్టండి.మీ సొమ్ము ఇబ్బడిముబ్బడిగా పెరుగుతుంది.

కాంగ్రెస్ వాకౌట్..

ప్రతిపక్షాలు ప్రధాని మోదీ ప్రసంగాన్ని బహిష్కరిస్తూ సభ నుంచి వాకౌట్ చేశాయి.

"మణిపూర్ పై ప్రధాని స్పందించాలని అవిశ్వాసతీర్మానాన్ని ప్రవేశపెట్టాం. గంటా 45 నిముషాలు మాట్లాడినా, ప్రధాని మణిపూర్ అన్న పదం కూడా వాడలేదు. మా ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. రాజకీయ వ్యాఖ్యానాలు చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయటమే" అని విమర్శించారు కాంగ్రెస్ సీనియర్ నేత శశిథరూర్.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe