/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-07T172933.773.jpg)
PM Modi: మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టబోతున్న నరేంద్ర మోడీ.. బీజేపీ సీనియర్ నేత, భారతరత్న ఎల్‌కే అద్వానీని గౌరవపూర్వకంగా కలిశారు. స్వయంగా అద్వానీ ఇంటికి వెళ్లి ఆశీర్వాదాలు తీసుకున్నారు. అలాగే మరో బీజేపీ సీనియర్ నేత మురళీ మనోహర్ జోషిని కలిసిన మోడీ.. వారిద్దరినీ తన ప్రమాణస్వీకారానికి రావాలని కోరారు. అక్కడినుంచి నేరుగా మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను సైతం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన మోడీకి మోడీకి రామ్‌నాథ్ కోవింద్ మిఠాయి తినిపించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి 240 సీట్లు రాగా.. నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ (ఎన్‌డిఎ)తో కలిపి మొత్తం 293 సీట్లు వచ్చాయి.