Gaganyaan Astronauts : ఇస్రో ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్ యాన్ మిషన్ కు సంబంధించిన నలుగురు వ్యోమగాములను ప్రపంచానికి పరిచయం చేశారు ప్రధానమంత్రి నరేంద్రమోదీ. భారతదేశ తొలి మానవసహిత అంతరిక్ష మిషన్ లో పర్యటించే ఈ నలుగురు వ్యోమగాముల పేర్లను మంగళవారం ప్రధాని మోదీ ప్రకటించారు. వారు పేర్లు గ్రూప్ కెప్టెన్ పీ బాలకృష్ణన్ నాయర్, గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్, వింగ్ కమాండర్ ఎస్ శుక్లా. వీరందరికీ అస్టోనాట్ వింగ్స్ ఇచ్చారు మోదీ. ఈ అంతరిక్ష వీరులు గగన్ యాన్ మిషన్ కింద అంతరిక్షంలోకి అడుగుపెడతారు.
తిరువనంతపురం సమీపంలోని తుంబలోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రంలో నలుగురు వ్యోమగాములకు ప్రధాని మోదీ 'ఆస్ట్రోనాట్స్ వింగ్స్' అందజేశారు.ఈ నేపథ్యంలో ఈ నలుగురు వ్యోమగాముల గురించి పూర్తి వివరాలను తెలుసుకుందాం.
ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్:
గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్..ఈయన కేరళ నివాసి.రష్యాలో అంతరిక్ష ప్రయాణాల కోసం ట్రైనింగ్ తీసుకున్నాడు.అంతేకాదు నేషనల్ డిఫెన్స్ అకాడమీ నుండి పట్టభద్రుడయ్యాడు. 1999లో కమీషన్డ్ ఆఫీసర్‌గా వైమానిక దళంలో చేరిన ప్రశాంత్..సుఖోయ్ యుద్ధ విమానాలను నడపడంలో దిట్ట. అలబామాలోని అమెరికా ఎయిర్ కమాండ్, స్టాఫ్ కాలేజీ నుండి మొదటి ర్యాంక్‌తో పట్టభద్రుడయ్యాడు.
అజిత్ కృష్ణన్:
గగన్‌యాన్ మిషన్‌కు ఎంపికైన నలుగురు 'అంతరిక్ష వీరుల్లో ఒకరు గ్రూప్ కెప్టెన్ అజిత్ కృష్ణన్.
అంగద్ ప్రతాప్:
గ్రూప్ కెప్టెన్ అంగద్ ప్రతాప్‌తో పాటు మరో ముగ్గురు కూడా రష్యాలో 13 నెలల పాటు శిక్షణ తీసుకున్నారని భారత అంతరిక్ష సంస్థ ఇస్రో తెలిపింది. గగన్‌యాన్ మిషన్ కింద ఆయన అంతరిక్షంలో భారత జెండాను కూడా ఎగురవేయనున్నారు.
సుభాన్షు శుక్లా:
వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా రష్యా రాజధాని మాస్కోలోని యూరి గగారిన్ కాస్మోనాట్ శిక్షణా కేంద్రంలో కూడా శిక్షణ తీసుకున్నారు. ఈ మిషన్ కింద అంతరిక్షానికి వెళ్లబోతున్నాడు.
గగన్‌యాన్ మిషన్ కింద మొత్తం నలుగురు వ్యోమగాములను భూమి ఉపరితలం నుంచి 400 కిలోమీటర్ల ఎత్తులో కక్ష్యలోకి పంపనున్నారు. ఇస్రో ఈ మిషన్ మూడు రోజుల పాటు ఉంటుంది. మిషన్‌ను పూర్తి చేసిన తర్వాత, ఈ వ్యోమగాములు అరేబియా సముద్రంలో దిగుతారు.
గగన్ యాన్ లో ప్రయాణించే ఈ నలుగురి పేర్లు ఇప్పుడు మనందరికీ తెలిసింది. ఈ నలుగురు కేవలం ప్రయాణికులు మాత్రమే కారు... 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలను అంతరిక్షంలోకి తీసుకువెళ్లేందుకు రెడీ అయిన శక్తులు.ఈ నలుగురు 40ఏళ్ల తర్వాత స్పేస్‌లోకి వెళుతున్నారు.