PM Modi: కొత్త సంవత్సరంలో మహిళలకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్..ఆ స్కీమ్ పొడిగించే ఛాన్స్..?

న్యూఇయర్ లో మహిళలకు మోదీసర్కార్ గుడ్ న్యూస్ అందించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు కేంద్రం మరోసారి ఫేమ్ స్కీంను పొడిగించే అవకాశం ఉందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఫేమ్ 3 ని తీసుకొచ్చేందుకు సర్కార్ కసరత్తు చేస్తుందని సమాచారం.

New Update
PM Modi: కొత్త సంవత్సరంలో మహిళలకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్..ఆ స్కీమ్ పొడిగించే ఛాన్స్..?

కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ (Narendra Modi government)మహిళలకు గుడ్ న్యూస్ చెప్పబోతుందా? మహిళలకు కొత్త ఏడాదిలో శుభవార్త అందించనుందా. అంటే పలు నివేదికల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం అవుననే సమాధానం వినిపిస్తోంది. కొత్త ఏడాదిలో మహిళలకు అదిరే రాయితీని అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్రం కసరత్తు చేస్తునున్నట్లు సమాచారం. ఎలక్ట్రిక్ వాహనాలను(Electric vehicles) ప్రోత్సహించేందుకు కేంద్రం మరోసారి ఫేమ్ స్కీం(Fame Scheme) పొడిగించే అవకాశం ఉన్నట్లు మీడియా నివేదికలు పేర్కొంటున్నాయి. ఫేమ్ 3ని కూడా తీసుకువచ్చేందుకు కేంద్రం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలుచేయాలని భావించే వారికి ఇది భారీ ఊరట:

ఒకవేళ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటే ఎలక్ట్రిక్ వెహికల్ కొనుగోలుచేయాలని భావించే వారికి ఇది భారీ ఊరటను కలిగిస్తుందని చెప్పవచ్చు. ఫేమ్ 3 స్కీంను వచ్చే ఆర్థిక ఏడాది నుంచి అమలు చేయాలని ఈ స్కీంకు రూ. 26,400కోట్లు కేటాయించాల్సి వస్తుందని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. మోదీ ప్రభుత్వం ఫేమ్ 1కు కొనసాగింపుగా ఫేమ్ 2 సబ్సిడీ స్కీంను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా ఎలక్ట్రిక్ టూవీలర్, త్రవీలర్, ఫోర్ వీలర్ కొనుగోళ్లపై సబ్సిడీ ఇస్తోంది. ఫేమ్ 2 స్కీం 2024 మార్చి 31 ముగియనుంది. అయితే ఇప్పటికే రెండు దశల్లో తీసుకువచ్చిన ఈ పథకాన్ని మూడో దశ అవసరాన్ని అర్థిక శాఖ ప్రశ్నించింది. అయితే ప్రత్యామ్నాయ ఇంధనంవైపు ప్రజలను మళ్లించేందుకు దీనికొనసాగింపు చాలా అవసరమని భారీ పరిశ్రమల శాఖ పట్టుబడుతుందని నివేదికలు అంటున్నాయి.

ఫేమ్ -3:
అందుకే ఫేమ్ 3(Fame 3) స్కీంను తీసుకువచ్చి అందులో భాగంగా ఎలక్ట్రిక్ టూవీలర్ల (Electric two-wheelers)కొనుగోలుపై రూ. 8.158కోట్లు ఈ బస్సుల కొనుగోలుపై రూ. 9,600 కోట్లు ఎలక్ట్రిక్ త్రీవీలర్లకొనుగోలపై రూ 4,100కోట్ల సబ్సిడీ రూపంలో ఇవ్వాలని భారీ పరిశ్రమల శాఖ యోచిస్తోంది. ఎలక్ట్రిక్ ఫోర్ వీలర్లకు సంబంధించి రూ. 1800కోట్లతోపాటు తొలిసారి ఈ-ట్రాక్టర్లను, హైబ్రిడ్‌ వాహనాలను ఈ స్కీం పరిధిలోకి చేర్చాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. ఇందుకోసం రూ.300 కోట్లు కేటాయించాలని ప్లాన్ చేస్తోంది. కిలోవాట్ బ్యాటరీకి తొలిఏడాది రూ. 15వేలు మరుసటి ఏడాది రూ. 7,500 ఆతర్వాత రెండేళ్లుగా సబ్సిడీ మొత్తాన్ని రూ. 3వేలు, రూ. 1500 వేలకు కుదించాలని భారీ పరిశ్రమల శాఖ యోచిస్తోందని నివేదికలు చెబుతున్నాయి.

మహిళలకు ప్రత్యేక డిస్కౌంట్ (Special discount for ladies)అందుబాటులోకి తీసుకురావచ్చని భావిస్తోంది. మహిళల పేరుతో రిజిస్టర్ చేసిన ఏ వాహనానికైనా పది శాతం అదనపు సబ్సిడీ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. దాదాపు రూ. 33వేల కోట్లతో మూడో దశ ఫేమ్ స్కీం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.

ఇది కూడా చదవండి : ఆర్బీఐ కీలక చర్యలు..ఆ ఖాతాలపై మినిమం బ్యాలెన్స్ నిబంధన ఎత్తివేత..!

Advertisment
తాజా కథనాలు