Farmers Protest: చెరుకు రైతులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ ..కొనుగోలు ధరలు పెంపు..కొత్త ధరలు ఇవే..!!

చెరుకు రైతులకు శుభవార్త చెప్పింది కేంద్రంలోని మోదీ సర్కార్. చెరుకు ధరను 8శాతం పెంచుతూ కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. క్వింటాల్ ధర రూ. 25పెంచింది. పాత ధర క్వింటాల్ కు రూ. 315 ఉండగా ఇప్పుడు రూ.340కు పెంచారు.

PM Modi: రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. నెలకు రూ.3 వేల పెన్షన్!
New Update

Farmers Protest: రైతుల ఉద్యమాల నడుమ...చెరుకు రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది కేంద్రంలోని మోదీ సర్కార్. చెరుకు సేకరణ ధరను 8శాతం పెంచుతూ  కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోదం తెలిపింది. కేబినెట్ నిర్ణయాలను వివరిస్తూ, కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఈ విషయాన్ని వెల్లడించారు. కేంద్ర మంత్రి మాట్లాడుతూ...చెరకు మిల్లుల ద్వారా రైతులకు న్యాయమైన, లాభదాయకమైన ధరను నిర్ధారించడానికి, రాబోయే చెరకు సీజన్‌కు అక్టోబర్ 1 నుండి వ్యవధిలో ధర నిర్ణయించాలని కేబినెట్ నిర్ణయం తీసుకుందని ఠాకూర్‌ అన్నారు.

చెరుకు ధరను క్వింటాల్‌కు రూ.25 పెంచింది. పాత ధర క్వింటాల్ రూ.315 ఉండగా ఇప్పుడు క్వింటాల్‌కు రూ.340కి పెంచారు. గత పదేళ్లలో రైతుల సంక్షేమం కోసం మోదీ ప్రభుత్వం ఎన్నో పనులు చేసిందని అనురాగ్ ఠాకూర్ అన్నారు. 2014కు ముందు ఎరువుల కోసం కూడా రైతులు వీధిన పడాల్సి న పరిస్ధితి నెలకొందన్నారు. అప్పట్లో చెరకు గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు అన్నారు. కానీ మోదీ సర్కార్ వచ్చాక రైతులకు అన్ని విధాలా మేలు జరుగుతుందని తెలిపారు.

2019-20లో చెరుకు రైతులకు రూ.75,854 కోట్లు అందాయని కేంద్ర మంత్రి తెలిపారు. 2020-21 సంవత్సరంలో రూ.93,011 కోట్లు.. 2021-22 సంవత్సరంలో చెరుకు రైతులకు రూ.1.28 లక్షల కోట్లు అందినట్లు చెప్పారు. అదే సమయంలో, 2022-23 సంవత్సరంలో రూ.1.95 లక్షల కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లోజమ చేసినట్లు చెప్పారు.

ఇది కూడా చదవండి: హైదరాబాద్‎లో బీఆర్ఎస్ భారీ బహిరంగసభ? ఈ సారి గులాబీ బాస్ అజెండా ఇదే…!!

#farmer #msp #modi-govt #sugarcane-farmers
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe