కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక ప్రకటించింది మోదీ సర్కార్. 4 శాతం డీఏ పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పెరిగిన డీఏ ఈ ఏడాది జూలై 1 నుంచి అమలులోకి రానున్నట్లు సమాచారం. ఉద్యోగులకు ప్రస్తుతం డీఏ 42 శాతంగా ఉంది. కేంద్రం తాజాగా ప్రకటించిన 4 శాతం పెంపుతో డీఏ 46 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఏడవ వేతన సంఘం సిఫారసు మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్రం తాజాగా తీసుకున్న ఈ డీఏ పెంపు నిర్ణయంతో 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 69 లక్షల మంది పింఛన్ దారులకు ప్రయోజనం చేకూరనుంది.
ఈ స్టోరీ అప్డేట్ అవుతోంది..