DA Hike: ఉద్యోగులకు మోదీ సర్కార్ దసరా శుభవార్త.. 4 శాతం డీఏ పెంపు దేశమంతా దసరా సందడి ప్రారంభమైన వేల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త చెప్పింది మోదీ సర్కార్. 4 శాతం డీఏ పెంపును ప్రకటించింది. By Nikhil 18 Oct 2023 in జాబ్స్ నేషనల్ New Update షేర్ చేయండి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు దసరా కానుక ప్రకటించింది మోదీ సర్కార్. 4 శాతం డీఏ పెంపునకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. పెరిగిన డీఏ ఈ ఏడాది జూలై 1 నుంచి అమలులోకి రానున్నట్లు సమాచారం. ఉద్యోగులకు ప్రస్తుతం డీఏ 42 శాతంగా ఉంది. కేంద్రం తాజాగా ప్రకటించిన 4 శాతం పెంపుతో డీఏ 46 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఏడవ వేతన సంఘం సిఫారసు మేరకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేంద్రం తాజాగా తీసుకున్న ఈ డీఏ పెంపు నిర్ణయంతో 48 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 69 లక్షల మంది పింఛన్ దారులకు ప్రయోజనం చేకూరనుంది. ఈ స్టోరీ అప్డేట్ అవుతోంది.. #modi #central-government మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి