Ram Mandir: ప్రస్తుతానికి అయోధ్యలోని రామ మందిరా (Ram Mandir)న్ని సందర్శించడం మానుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) బుధవారం తన మంత్రివర్గ సహచరులకు సూచించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ మంత్రుల(Cabinet Ministers) సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండడానికి మార్చిలో కేంద్ర మంత్రి అయోధ్య(ayodhya)కు కార్యక్రమాలు చేయాలని అన్నారు.
ప్రధాని మోదీ ఏం చెప్పారు?
విపరీతమైన రద్దీ, ప్రోటోకాల్‌లతో వీఐపీల కారణంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు, మార్చిలో అయోధ్య పర్యటనను ప్లాన్ చేసుకోవాలని ప్రధాని మోదీ కేంద్ర మంత్రులకు సూచించినట్లు వార్తా సంస్థ ANI పేర్కొంది.జనాలను అదుపు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. అయితే, ప్రజల సౌలభ్యం, భద్రతకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిపాలనను కోరారు. రామ్ లల్లాకు పట్టాభిషేకం తర్వాత, ప్రతి ఒక్కరూ భవ్యరాముడిని చూసేందుకు తహతహలాడుతున్నారు. దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు అయోధ్యకు చేరుకుంటున్నారు.
మార్చిలో రాంలల్లాను చూసేందుకు :
జనవరి 22న అయోధ్యలోని రామాలయంలో రాంలల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దీనికి సంబంధించి ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించింది. ఈ మేరకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కేబినెట్‌లో ప్రతిపాదించారు. కేబినెట్ మీటింగ్‌లో, రామ మందిర ప్రారంభోత్సవానికి సంబంధించి, ప్రజలకు ఏమి సందేశం పంపారు అని మంత్రులను పిఎం మోదీ అడిగారు. అప్పుడు మంత్రులందరూ ప్రజలకు తమ అభిప్రాయాన్ని తెలిపారు. దీని తరువాత, రద్దీ కారణంగా ఫిబ్రవరి వరకు రాంలల్లా దర్శనం కోసం అయోధ్యకు వెళ్లకుండా ఉండాలని, ప్రోటోకాల్ కారణంగా, సాధారణ భక్తులకు దర్శనంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు క్యాబినెట్ మంత్రులందరినీ పిఎం మోదీ కోరారు. సమాచారం ప్రకారం, మంత్రులందరూ మార్చి నెలలో రామాలయాన్ని సందర్శించనున్నారు.
కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న ఇవ్వాలని నిర్ణయం:
ఈరోజు జరిగిన కేబినెట్ సమావేశంలో కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న ప్రదానం చేయాలని నిర్ణయించినందుకు ప్రధాని మోదీకి మంత్రివర్గం కృతజ్ఞతలు తెలిపింది. ఒక కార్యక్రమంలో, ప్రధాని మోదీ మాట్లాడుతూ, నిన్న దేశం ఒక పెద్ద నిర్ణయం తీసుకుందని, జననాయక్ కర్పూరీ ఠాకూర్‌కు భారతరత్న ఇవ్వాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. నేటి యువ తరానికి కర్పూరి ఠాకూర్ గురించి తెలుసుకోవడం, అతని జీవితం నుండి నేర్చుకోవడం చాలా ముఖ్యం. జననాయక్ కర్పూరీ ఠాకూర్‌ను భారతరత్నతో సత్కరించే అవకాశం రావడం మన ప్రభుత్వ అదృష్టమన్నారు.