Voting: ప్రజలకు ఓటు హక్కు కల్పించిన మొదటి దేశం ఏంటో తెలుసా?

ప్రపంచంలో ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికైన తొలి దేశం అమెరికా. అక్కడే తొలిసారి ప్రజలు ఓటు హక్కును వినియోగించుకున్నారు. అమెరికాలో మొదటి అధ్యక్ష ఎన్నికలు 1788-1789లో జరిగాయి. అయితే పౌరులందరికీ అమెరికా ఓటు హక్కు ఇవ్వలేదు. అమ్మాయిలు ఓటింగ్‌లో పాల్గొనలేదు.

New Update
Voting: ప్రజలకు ఓటు హక్కు కల్పించిన మొదటి దేశం ఏంటో తెలుసా?

నవంబర్‌ 30న తెలంగాణ ఎన్నికల(Telangana elections) పోలింగ్‌ జరగనుంది. ప్రజాస్వామ్యంలో ఓటుకు మించిన ఆయుధం లేదు. ఓటు హక్కు ఉన్నవారందరూ దీన్ని వినియోగించుకోవాలి. ఏ పార్టీ నచ్చకుంటే నోటాకు కూడా వెయవచ్చు. లేకపోతే మన ఓటును వేరే ఎవరో వేసేస్తారు. అవే దొంగ ఓట్లు. ప్రజాస్వామ్య(Democracy) దేశంలో ఓటు వెయ్యడం అన్నిటికంటే ముఖ్యం. గతంలో అసలు ఓటు వేసే రైటే చాలా మందికి ఉండేది కాదు. ఇలా ప్రజలకు ఓటు హక్కు కల్పించిన తొలి దేశం ఏంటో తెలుసా?

అమెరికాలో తొలి ప్రజాస్వామ్యబద్దమైన ఓటింగ్:
ఎన్నికలలో ఓటింగ్ అనే భావన పురాతన గ్రీస్ నాటిది. అయితే 18వ శతాబ్దం చివరిలో యునైటెడ్ స్టేట్స్‌(United States)లో ఆధునిక ప్రజాస్వామ్య ఎన్నికలు ప్రారంభమయ్యాయి. అమెరికాలో మొదటి అధ్యక్ష ఎన్నికలు 1788-1789లో జరిగాయి. ఓటర్లు ఈ ఎంపికలో పాల్గొన్నారు. అయితే అమెరికాలో అందరికి ఓటు హక్కు లేదు. ముఖ్యంగా అమ్మాయిలకు ఓటు హక్కు ఉండేది కాదు. అయితే ప్రజాస్వామ్యంలో మొదటి ఓటు అక్కడే పడింది. జార్జ్ వాషింగ్టన్ యునైటెడ్ స్టేట్స్ మొదటి అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు, 1789 నుంచి 1797 వరకు రెండు పర్యాయాలు పనిచేశారు. ఓటర్లు ఓటు వేసే పద్ధతి నేటికీ వాడుకలో ఉన్న ఎన్నికల వ్యవస్థకు అమెరికా పునాది వేసింది.

publive-image ఫైల్

ఓటు ఎందుకు వెయ్యాలి:

ప్రజాస్వామ్యంలో ఓటు వేయడం చాలా అవసరం. ఎందుకంటే ఇది నేరుగా పౌరులను ప్రభుత్వ నిర్ణయాత్మక ప్రక్రియలో పాల్గొనేలా చేస్తుంది. ఇది ప్రజాప్రతినిధులను ఎంచుకోవడానికి అనుమతిస్తుంది. ఓటింగ్ ప్రజల సమిష్టి సంకల్పాన్ని ప్రతిబింబిస్తుంది. వివిధ సమస్యలపై వారి ప్రాధాన్యతలను వ్యక్తీకరించడానికి ఇది అనుమతిస్తుంది. ప్రజాస్వామ్య ఎన్నికలు నాయకత్వ మార్పులకు శాంతియుత మార్గాలను అందిస్తాయి. ప్రజాప్రతినిధులు తమ విధులను నిర్వర్తించడంలో విఫలమైతే లేదా ప్రజావ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే, వచ్చే ఎన్నికల్లో వివిధ నాయకులను ఎన్నుకోవడం ద్వారా ఓటర్లు తమ అసంతృప్తిని వ్యక్తం చేయవచ్చు.

Also Read: హార్దిక్ వెనక్కి రావడంపై బుమ్రా అసహనంగా ఉన్నాడా?

WATCH:

Advertisment
తాజా కథనాలు