కొద్ది రోజులుగా దివ్య పహుజా(Divya Pahuja) హత్య కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఓ వైపు మోడల్ మృతదేహాన్ని పోలీసులు కనుగొనగా, మరోవైపు మరో నిందితుడిని కూడా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించిన లింకులు ఒక్కొక్కటిగా కనెక్ట్ అవుతున్నాయి. తాజాగా దివ్య పోస్టుమార్టాన్ని వైద్య బృందం పూర్తి చేసింది. దివ్యను అతి సమీపం నుంచి కాల్చి చంపినట్లు పోస్టుమార్టంలో తేలింది.
పాయింట్ బ్లాక్‌లో కాల్చారు:
పాయింట్ బ్లాక్ రేంజ్ నుంచి బుల్లెట్ పేలినట్లు సమాచారం. అంటే తుపాకీని నుదుటిపై పెట్టి బుల్లెట్ పేల్చారు. దీంతో దివ్య అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. మొత్తం నలుగురు వైద్యులు దివ్య పోస్ట్‌మార్టాన్ని పూర్తి చేశారు. ప్రస్తుతానికి దివ్య మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం కుటుంబసభ్యులకు అప్పగించారు. ఫతేహాబాద్‌లోని జఖాల్‌లోని భాక్రా కాలువ నుంచి దివ్య మృతదేహం లభ్యమైన విషయం తెలిసిందే. మృతదేహం కూడా కాలువలో 150 కిలోమీటర్లు ముందుకు వెళ్లింది.. తరువాత శరీరంపై ఉన్న టాటూ ఆధారంగా దివ్యను గుర్తించారు. తరువాత, దివ్య ఫొటోను కూడా కుటుంబ సభ్యులకు పంపారు. మృతదేహాన్ని నిర్ధారించిన తర్వాత, పోస్ట్ మార్టం నిర్వహించారు.
న్యూఇయర్ తర్వాతి రోజు హత్య:
గురుగ్రామ్‌లోని హోటల్ సిటీ పాయింట్ వద్ద జనవరి 2న దివ్య హత్యకు గురైంది. హోటల్ యజమాని అభిజీత్ సింగ్ ఆమెపై కాల్పులు జరిపాడు. బాల్‌రాజ్ గిల్ అనే వ్యక్తి దివ్య మృతదేహాన్ని బీఎండబ్ల్యూ కారు ట్రంక్‌లో పెట్టి అదృశ్యమయ్యాడు. చాలా రోజుల తర్వాత విదేశాలకు వెళ్లాలని భావిస్తున్న బాల్‌రాజ్ గిల్‌ను పోలీసులు పట్టుకున్నారు. బాల్‌రాజ్‌ను పట్టుకున్న మరుసటి రోజే దివ్య మృతదేహం లభించింది. దివ్య ఫోన్‌లో కొన్ని అసభ్యకర చిత్రాలు ఉండడంతో ఆమె తనను పదే పదే బ్లాక్ మెయిల్ చేస్తోందని అందుకే హత్య చేశానని ప్రధాన నిందితుడు అభిజీత్ సింగ్ చెబుతున్నాడు.
Also Read: అప్పటికి భారత్ లో పది కోట్లమంది సంపన్నులు
WATCH: