MLC Accident : ఎమ్మెల్సీది యాక్సిడెంట్‌ కాదా..? చంపేశారంటున్న కుమారుడు!

టీచర్స్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ మృతి పట్ల ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అది ప్రమాదం కాదు అని కావాలని పక్కా ప్రణాళిక ప్రకారమే..యాక్సిడెంట్‌ రూపంలో హత్య చేశారని ఆయన కుమారుడు ఆరోపిస్తున్నారు.

New Update
MLC Accident : ఎమ్మెల్సీది యాక్సిడెంట్‌ కాదా..? చంపేశారంటున్న కుమారుడు!

Shaik Sabjee : శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో టీచర్స్ ఎమ్మెల్సీ(Teachers MLC) షేక్‌ సాబ్జీ(Shaik Sabjee) మృతి చెందిన సంగతి తెలిసిందే.అయితే ఆయన మృతి పై కుటుంబ సభ్యులు, బంధువులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో సాబ్జీ కుమారుడు మీడియాతో మాట్లాడుతూ..'' మా నాన్ను చంపి, రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. కేవలం మా నాన్న కూర్చున్న వైపు మాత్రమే కారు ఢీకొట్టినట్లు కనిపిస్తుంది. కారులో ఉన్న మా నాన్న మాత్రమే చనిపోయారు. మిగిలిన వారికి చిన్న చిన్న గాయాలు అయ్యాయి. మా నాన్న మృతి పట్ల మాకు అనుమానాలున్నాయని సాబ్జీ కుమారుడు ఆరోపిస్తున్నారు.

మరోవైపు సాబ్జీ సోదరుడు కూడా ఆయన మృతి పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. '' మా తమ్ముడి మరణం ప్రమాదం కాదు..కావాలనే పక్కా ప్లాన్‌ ప్రకారం ఆయనను చంపేసినట్లు తెలుస్తుంది. మా తమ్ముడి పై కక్ష కట్టారని'' ఆరోపిస్తున్నారు. అసలు సాబ్జీని చంపేంత కక్ష ఎవరికి ఉందంటూ పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

శుక్రవారం పశ్చిమగోదావరి జిల్లా ఉండి మండలం చెరుకువాడ(Cherukuwada) ప్రధాన రహదారి పై ఎమ్మెల్సీ కారును ఎదురుగా వస్తున్న మరో కారు బలంగా ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న టీచర్స్‌ ఎమ్మెల్సీ షేక్‌ సాబ్జీ తీవ్ర గాయాలపాలై మృతి చెందారు. ఆయన నిన్న జరిగిన అంగన్‌వాడీ టీచర్ల సమ్మెలో పాల్గొనేందుకు భీమవరం నుంచి ఏలూరువచ్చారు.

కార్యక్రమంలో పాల్గొన్న సాబ్జీ ఆ కార్యక్రమం ముగిసిన తరువాత ఆయన కారులో గన్‌మెన్‌ , పీఏతో కలిసి ఏలూరు నుంచి భీమవరం వైపు తిరిగి వస్తున్నారు. ఈ క్రమంలోనే చెరుకువాడ వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టడంతో ఎమ్మెల్సీ సాబ్జీ అక్కడికక్కడే మరణించారు. దీంతో ఆయన మృతదేహన్ని భీమవారం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

గాయాలైన పీఏ, గన్‌ మెన్‌ లను భీమరం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఎమ్మెల్సీ స్వగ్రామం తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి మండలం ధూమంతుని గూడెం గ్రామం. యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఉన్న షేక్‌ సాబ్జి ఉపాధ్యాయ సమస్యల పరిష్కారం కోసం విస్తృతంగా శ్రమించారు. ఉపాధ్యాయుల హక్కుల కోసం ఎంతగానో పోరాడారు. అందుకే ఆయన 2021 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏకపక్షంగా గెలుపొందారు. ఆయన మృతితో ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన చెందుతున్నాయి. మంచి నాయకుడిని కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Also read: ఈ ఏడాది గూగుల్ లో తెగ వెతికేసిన పదాలు ఏంటో తెలుసా!

Advertisment
Advertisment
తాజా కథనాలు