/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/MLC-KAVITHA-jpg.webp)
MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం సీబీఐ కేసులో నేటితో ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీ ముగియనుంది. ఈ కేసులో కవిత పాత్రపై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. ఛార్జిషీట్ పరిగణనలోకి తీసుకునే విషయంపై జులై 3న కోర్టు విచారణ జరపనుంది. ఈడీ నమోదు చేసిన కేసులో జులై 3 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించింది రౌస్ అవెన్యూ కోర్టు. కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్ చేసింది ఢిల్లీ హైకోర్టు. ఈ క్రమంలో ఈరోజు మధ్యాహ్నం కవితను వర్చువల్‌గా కోర్టులో అధికారులు హాజరుపర్చుతారు.
కాగా ఎమ్మెల్సీ కవితకు ఈసారైనా బెయిల్ వస్తుందా? లేదా ఆమె జ్యుడిషియల్ కస్టడీని పొడిగిస్తారా? అనే ఉత్కంఠ బీఆర్ఎస్ శ్రేణుల్లో మొదలైంది. ఇటివల తీహార్ జైలు ఉన్న ఎమ్మెల్సీ కవితను ఆమె సోదరుడు మాజీ మంత్రి కేటీఆర్ కలిశారు. ఆ మరుసటి రోజు మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్ కలిశారు.
ఇదే కేసులో కేజ్రీవాల్ కు షాక్..
ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు షాక్ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో ఇచ్చిన బెయిల్‌ను హోల్డ్ చేసింది ఢిల్లీ హైకోర్టు. నిన్న షరతులతో కూడిన బెయిల్‌ను కోర్టు మంజూరు చేసిన విషయం తెలిసిందే. అయితే కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వడంపై ఈడీ హైకోర్టును ఆశ్రయించింది. బెయిల్ రద్దు చేయాలని.. తమ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని కోరింది. దీంతో తాజాగా హైకోర్టు కేజ్రీవాల్‌కు మంజూరు చేసిన బెయిల్‌ను నిలిపివేసింది.