MLC Kavitha: లిక్కర్ స్కాం కేసులో కవితకు బెయిలా..? జైలా..?

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్‌ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు రేపు తీర్పు వెల్లడించనుంది. న్యాయమూర్తి బెయిల్‌పై ఎలాంటి నిర్ణయం వెల్లడిస్తారన్న దానిపై బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది.

New Update
MLC Kavitha: లిక్కర్ స్కాం కేసులో కవితకు బెయిలా..? జైలా..?

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్‌ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు రేపు తీర్పు వెల్లడించనుంది. సోమవారం ఉదయం 10.30 గంటలకు సీబీఐ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి కావేరీ బవేజా తీర్పు వెల్లడిస్తారు. అయితే ఏప్రిల్ 16 వరకు తన కొడుకుకు పరీక్షలు ఉన్నాయని.. అప్పటి వరకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని కవిత కోరిన సంగతి తెలిసిందే. రేపు న్యాయమూర్తి బెయిల్‌పై ఎలాంటి నిర్ణయం వెల్లడిస్తారన్న దానిపై బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తల్లో ఉత్కంఠ నెలకొంది.

Advertisment
తాజా కథనాలు