Kavitha : సూర్యునిపై ఉమ్మేస్తే అది తిరిగి మీ మీదే పడుతుంది.. రేవంత్‌పై కవిత ఆగ్రహం!

రేవంత్ రెడ్డిపై ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డారు కవిత. కేసీఆర్‌పై అసభ్య పదజాలం ప్రయోగించిన రేవంత్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయాలన్నారు. సూర్యునిపై ఉమ్మేస్తే అది తిరిగి మీ మీదే పడుతుందన్న విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోవద్దని చురకలంటించారు.

New Update
Kavitha : సూర్యునిపై ఉమ్మేస్తే అది తిరిగి మీ మీదే పడుతుంది.. రేవంత్‌పై కవిత ఆగ్రహం!

MLC Kavitha Vs CM Revanth Reddy : తెలంగాణ(Telangana) సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) పై బీఆర్‌ఎస్‌(BRS) మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్(Ex. MLA Balka Suman) చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా రచ్చకు దారితీశాయి. బాల్క సుమన్‌పై ఇప్పటికే మంచిర్యాల పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. 294B, 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అసభ్యపదజాలం వాడడం, బెదిరింపులకు దిగడంలాంటి సెక్షన్ల కింద కేసు ఫైల్ చేశారు. జరుగుతున్న పరిణామాలపై ఎమ్మెల్సీ కవిత రియాక్ట్ అయ్యారు. రేవంత్‌రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Also Read : Drugs: హైదరాబాద్‌ లో మరోసారి డ్రగ్స్ కలకలం.!

కవిత ఏం అన్నారంటే?
రేవంత్ రెడ్డిపై ట్విట్టర్‌ వేదికగా మండిపడ్డారు కవిత(Kalvakuntla Kavitha). కేసీఆర్‌(KCR) పై అసభ్య పదజాలం ప్రయోగించిన రేవంత్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేయాలన్నారు. రేవంత్ రెడ్డి పై పోలీసులు కేసు నమోదు చేయకపోతే న్యాయస్థానాలను ఆశ్రయిస్తామన్నారు కవిత. మాజీ ఎమ్మెల్యే, దళిత బిడ్డ బాల్క సుమన్ పై కేసు నమోదు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అవలంబించిన విధానాలనే ప్రస్తుత ప్రభుత్వం అవలంభిస్తోందన్నారు కవిత. తెలంగాణలో ఢిల్లీ రిమోట్ కంట్రోల్ పాలన రాచరిక వ్యవస్థను తలపిస్తోందని ఆరోపించారు. సూర్యునిపై ఉమ్మేస్తే అది తిరిగి మీ మీదే పడుతుందన్న విషయాన్ని రేవంత్ రెడ్డి మర్చిపోవద్దని చురకలంటించారు. కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ ను సాధించిన కేసీఆర్‌పై రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయన్నారు కవిత.

బాల్క సుమన్‌ ఏం అన్నారంటే?
రేవంత్ రెడ్డిపై బాల్క సుమన్ షాకింగ్ కామెంట్స్(Balka Suman Shocking Comments) చేశారు. కేసీఆర్ జోలికొస్తే చెప్పుతో కొడతా అని పరుషపదజాలాన్ని ఉపయోగించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో జరిగిన విస్తృతస్థాయి సమావేశంలో బాల్క సుమన్ మాట్లాడుతూ..సీఎం రేవంత్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా బూతులు కూడా మాట్లాడారు. ఆయన మాటల వీడియోలన్నిటికి బీప్‌ సౌండ్లే ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 420 హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి త‌న స్థాయిని త‌గ్గించుకుని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఉద్యమానికి వెన్నుపోటు పొడిచినా కాంగ్రెస్ నాయకులను బీఆర్ఎస్ ప్రభుత్వంలో క్షమించి వదిలేసామన్నారు. అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే రేవంత్ రెడ్డి అహంకారంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు.

Also Read: సేవింగ్స్.. ఇన్సూరెన్స్ రెండూ ఒకే దానిలో.. LIC కొత్త పాలసీ ఇదే!

WATCH:

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు