బీఎస్‌ రావు సంతాప సభలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత

శ్రీ చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకుడు బీఎస్‌ రావు సంతాప సభ ఆదివారం రంగారెడ్డి జిల్లా నార్సింగిలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కవిత, మంత్రులు మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్‌ పాల్టొన్నారు. బీఎస్‌ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు

బీఎస్‌ రావు సంతాప సభలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత
New Update

శ్రీ చైతన్య విద్యా సంస్థల వ్యవస్థాపకులు డాక్టర్‌ బొప్పన సత్యనారాయణరావు (Boppana Satyanarayana Rao) సంతాప సభ ఆదివారం రంగారెడ్డి జిల్లా నార్సింగి(Narsinghi)లోని ఓ కన్వెన్షన్‌ హాల్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(kavitha), మంత్రులు మల్లారెడ్డి(Mallareddy), తలసాని శ్రీనివాస్ యాదవ్ (Thalasani Srinivas Yadav) హాజరయ్యారు. బీఎస్‌రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించిన కవిత బీఎస్‌రావు కుటుంబ సభ్యులను పరామర్శించి దైర్యం చెప్పారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. వృత్తిరిత్యా బీఎస్‌రావు డాక్టర్‌ అని విదేశాల్లో వైద్య సేవలు అందించారని గుర్తు చేశారు. ఆడపిల్లల చదువుపై ఆలోచించిన ఆయన.. అమ్మాయిలకు మెరుగైన విద్య అందించాలనే లక్ష్యంగా విద్యా సంస్థను ప్రారంభించారని తెలిపారు.

ఇందులో భాగంగా 1986వ సంవత్సరంలో విజయవాడ(Vijayawada)లో 56 మంది విద్యార్థునులతో మొదటి ప్రాంచ్‌ ప్రారంభించారు. శ్రీ చైతన్య విద్యా సంస్థ ప్రారంభించిన మొదటి ఏడాదే ప్రభంజనం సృష్టించినట్లు కవిత వెల్లడించారు. బోధనలోనూ, సిబ్బంది నిర్వహణలోనూ మరింత మెరుగైన విధానాన్ని ప్రవేశ పెట్టడంతో ఒక నూతన అధ్యాయం ప్రారంభమైందని తెలిపారు. ఇంటర్ నుంచి విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేయటంలో శ్రీ చైతన్య విద్యాసంస్థల వ్యవస్థాపకుడు బీఎస్‌ రావు (BS Rao) తన ప్రత్యేకతను నిలుపుకున్నారన్నారు. పదవ తరగతిలో మంచి మార్కులు సాధించిన విద్యార్థులను గుర్తించి.. వారికి ఇంటర్ నుండే చక్కటి పునాది వేసేందుకు సమాయత్తమయ్యేటట్లు ఈ విద్యా వ్యవస్థను తీర్చిదిద్దారన్నారు.

శ్రీచైతన్య విద్యా సంస్థల (Sri Chaitanya Educational Institutions) ప్రస్థానం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ సరిహద్దులు దాటి ఢిల్లీ, హిమాచల్‌ప్రదేశ్‌, కర్నాటకలకు చేరింది. 2006లో హిమాచల్‌ప్రదేశ్‌, చండీగఢ్‌, ఝార్ఖండ్‌, మధ్యప్రదేశ్‌లో ఐఐటీ-జేఈఈ, AIEEE కోచింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. ఆ సమయంలోనే అమెరికాలో ఉన్న తన కుమార్తెలు సీమా(Seema), సుష్మా (Sushma) భారత్‌కు వచ్చి తన తండ్రికి చేదోడువాదోడుగా ఉంటూ చైతన్య విద్యాసంస్థలను దేశ వ్యాప్తంగా విస్తరించడంలో కీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 321 జూనియర్‌ కళాశాలలు, 322 టెక్నో స్కూల్స్‌, 107 సీబీఎస్‌ఈ స్కూల్స్‌ ఉన్నాయి. శ్రీచైతన్య విద్యాసంస్థల్లో దాదాపు 8.5లక్షల మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు.

కాగా తాను ఇరాన్‌(Iran)లో పనిచేస్తున్న సమయంలో ఇండియాకు వచ్చి తన కుమార్తెల విద్య కోసం ఓ మంచి స్కూల్‌ కోసం వెతికినట్లు.. ఆ సమయంలోనే బాలికల కోసం ప్రత్యేకించి కాలేజీలు తనకు కనిపించలేదని, బీఎస్‌ రావు గతంలో తెలిపారు. పదో తరగతిలో మంచి రిజల్ట్స్ సాధిస్తున్న విద్యార్థులు ఇంటర్‌ విద్యకు వచ్చేసరికి సరైన ప్రతిభ కనబరచలేకపోవడం, ఇక్కడ సరైన విద్య అందుబాటులో లేకపోవడం కూడా తాను విద్యాసంస్థ ఏర్పాటు చేసేందుకు దోహదం చేశాయన్నారు. అందుకే ఇంటర్‌ విద్యార్థుల కోసం పోటీ పరీక్షలకు శిక్షణా సంస్థను స్థాపించినట్లు ఆయన గతంలో పేర్కొన్నారు.

#brs #mlc-kavitha #mallareddy #bs-rao #santhapa-sabha #thalasani-srinivas-yadav
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe