MLC Kavitha: రేవంత్ ఆవేదన బూటకం.. సంచలన వీడియో బయటపెట్టిన ఎమ్మెల్సీ కవిత

గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య వ్యవహారంలో టీసీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత నిప్పులు చెరిగారు. రేవంత్ ఆవేదన బూటకం... కాంగ్రెస్ ఆందోళన నాటకం అంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వం విడుదల చేసిన ప్రతీ నోటిఫికేషన్ ను అడ్డుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు చేసిందంటూ ధ్వజమెత్తారు. గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అసెంబ్లీలో మాట్లాడిన వీడియోను కవిత ట్వీట్ చేశారు.

MLC Kavitha: కవితకు ఇంటి భోజనం ఇవ్వాలని ఆదేశించిన కోర్టు
New Update

గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య అంశం తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ అంశంపై ఈ రోజు ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) టార్గెట్ గా ట్వీట్ చేశారు టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy). 'బతుకమ్మ సంబరాల గురించి రంగురంగుల వీడియోలు పెట్టే ఎమ్మెల్సీ కవితకు.. గ్రూప్ పరీక్షల నిర్వహణ అవకతవకలతో బతుకు భారమై, భవిత ఆగమై ఆత్మహత్య చేసుకున్న ప్రవల్లిక ఆత్మ ఘోష వినబడటం లేదా!?, ఆడబిడ్డల హక్కులు మీ దృష్టిలో రాజకీయ అంగడి సరుకే తప్ప… పొలిటికల్ స్లోగన్లు తప్ప మానవీయ ఎజెండాలు కాదు.' అంటూ ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి ట్వీట్ పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. బతుకమ్మను కించపరచడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం విచారకరం... ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రావద్దన్నారు.
ఇది కూడా చదవండి: Pravalika Death: ప్రవళిక ఆత్మహత్యపై గవర్నర్ కీలక ఆదేశాలు.. ప్రభుత్వ హత్య అన్న రాహుల్ గాంధీ..


ఇంకా.. ''మేము బతుకమ్మ చేస్తాము.. బాధను కూడా పంచుకుంటాము. తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగను కించపరచడం ఒక కాంగ్రెస్ పార్టీకి మాత్రమే సాధ్యం. ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకుంటే సానుభూతి వ్యక్తం చేయడం పోయి రాజకీయం చేయడం కాంగ్రెస్ విధానమా?. నోటిఫికేషన్లకు మోకాలడ్డుతూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నదే కాంగ్రెస్ పార్టీ. తెలంగాణలో ఏ ఒక్క ఉద్యోగం నోటిఫికేషన్ జారీ అయినా దాన్ని అడ్డుకోవడానికి కాంగ్రెస్ పార్టీ విశ్వ ప్రయత్నాలు చేసింది వాస్తవం కాదా? కాంగ్రెస్ కుట్రలకు బద్దలు కొట్టి లక్షలాది ఉద్యోగాలను భర్తీ చేసిన ఘనత సీఎం కేసీఆర్ గారిది...

చివరికి గ్రూప్ 2 ని వాయిదా వేయాలని మీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు శ్రీధర్ బాబు అసెంబ్లీలో డిమాండ్ చేయడమే కాకుండా రేవంత్ రెడ్డి కూడా Xలో డిమాండ్ చేయలేదా? శవాల మీద పేలాలు ఏరుకోవడం కాంగ్రెస్ పార్టీకి, రేవంత్ రెడ్డికి వెన్నతో పెట్టిన విద్య. హత్య చేసిన వాళ్లే ఓదార్చుతున్నట్లు ఉంది మీ వ్యవహార శైలి. రేవంత్ ఆవేదన బూటకం...కాంగ్రెస్ ఆందోళన నాటకం..'' అంటూ రేవంత్ రెడ్డిపై ట్విట్టర్ లో నిప్పులు చెరిగారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత.

#telangana-politcs #brs-kavitha
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe