Governor Seeks Report on Pravalika Death: నియామక పరీక్షలు వాయిదా పడడంతో హైదరాబాద్ లో ప్రవళిక అనే నిరుద్యోగ యువతి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు. నిరుద్యోగ యువతి ప్రవళిక ఆత్మహత్య అత్యంత బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఆత్మహత్యగా మాత్రమే చూడవద్దని.. నిరుద్యోగ యువత కలలు ఆశలను ప్రభుత్వం హత్య చేసినట్టు ఉందని ఆరోపించారు. త్వరలో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ రాబోతుందన్నారు. తమ ప్రభుత్వం నిరుద్యోగ యువత ఆశలను నిలబెడుతుందని హామీ ఇచ్చారు. యూపీఎస్సీ తరహాలో టీఎస్పీఎస్సీ కూడా నిర్వహిస్తామన్నారు రాహుల్. ఒక్క ఏడాది లో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని నిరుద్యోగులకు భరోసానిచ్చారు. ఇది మా గ్యారెంటీ అని స్పష్టం చేశారు రాహుల్.
పూర్తిగా చదవండి..Pravalika Death: ప్రవళిక ఆత్మహత్యపై గవర్నర్ కీలక ఆదేశాలు.. ప్రభుత్వ హత్య అన్న రాహుల్ గాంధీ..
హైదరాబాద్ లో ప్రవళిక ఆత్మహత్య విషయంపై గవర్నర్ తమిళిసై సైతం స్పందించారు. ఈ కేసులో 48 గంటల్లో నివేదిక ఇవ్వాలంటూ సీఎస్, డీజీపీ, టీఎస్పీఎస్సీ సెక్రెటరీలను గవర్నర్ ఆదేశించారు. ఇది ప్రభుత్వ హత్య అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు.
Translate this News: