గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య అంశం తెలంగాణ రాజకీయాల్లో (Telangana Politics) ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ అంశంపై ఈ రోజు ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavitha) టార్గెట్ గా ట్వీట్ చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth Reddy). ‘బతుకమ్మ సంబరాల గురించి రంగురంగుల వీడియోలు పెట్టే ఎమ్మెల్సీ కవితకు.. గ్రూప్ పరీక్షల నిర్వహణ అవకతవకలతో బతుకు భారమై, భవిత ఆగమై ఆత్మహత్య చేసుకున్న ప్రవల్లిక ఆత్మ ఘోష వినబడటం లేదా!?, ఆడబిడ్డల హక్కులు మీ దృష్టిలో రాజకీయ అంగడి సరుకే తప్ప… పొలిటికల్ స్లోగన్లు తప్ప మానవీయ ఎజెండాలు కాదు.’ అంటూ ట్వీట్ చేశారు. రేవంత్ రెడ్డి ట్వీట్ పై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తీవ్రంగా స్పందించారు. ఈ మేరకు ఆమె ట్వీట్ చేశారు. బతుకమ్మను కించపరచడాన్ని తీవ్రంగా తప్పుబట్టారు. ప్రవళిక ఆత్మహత్య చేసుకోవడం విచారకరం… ఏ తల్లిదండ్రులకు ఇలాంటి పరిస్థితి రావద్దన్నారు.
ఇది కూడా చదవండి: Pravalika Death: ప్రవళిక ఆత్మహత్యపై గవర్నర్ కీలక ఆదేశాలు.. ప్రభుత్వ హత్య అన్న రాహుల్ గాంధీ..
MLC Kavitha: రేవంత్ ఆవేదన బూటకం.. సంచలన వీడియో బయటపెట్టిన ఎమ్మెల్సీ కవిత
గ్రూప్-2 అభ్యర్థి ప్రవళిక ఆత్మహత్య వ్యవహారంలో టీసీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్సీ కవిత నిప్పులు చెరిగారు. రేవంత్ ఆవేదన బూటకం... కాంగ్రెస్ ఆందోళన నాటకం అంటూ ధ్వజమెత్తారు. ప్రభుత్వం విడుదల చేసిన ప్రతీ నోటిఫికేషన్ ను అడ్డుకోవడానికి కాంగ్రెస్ ప్రయత్నాలు చేసిందంటూ ధ్వజమెత్తారు. గ్రూప్-2 పరీక్షను వాయిదా వేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అసెంబ్లీలో మాట్లాడిన వీడియోను కవిత ట్వీట్ చేశారు.
Translate this News: