MLC Kavitha: లిక్కర్ స్కామ్ కేసులో కవితకు బెయిల్.. నేడే తీర్పు!

కవిత బెయిల్ పిటిషన్‌పై ఈరోజు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. గత విచారణ సందర్భంగా కవిత పిటిషన్‌పై ఈడీ, సీబీఐలకు సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. కవితకు మధ్యంతర బెయిల్ ఇచ్చేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. తాజాగా కవిత బెయిల్‌పై ఉత్కంఠ నెలకొంది.

New Update
Kavitha: ఈరోజు జైలు నుంచి కవిత విడుదల!

MLC Kavitha: లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై గత ఐదు నెలలుగా తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ పై ఈరోజు సుప్రీం కోర్టు విచారణ చేపట్టనుంది. ఇప్పటికే పలు మార్లు ఢిల్లీ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన కవితకు నిరాశే మిగిలింది. కవితకు వ్యతిరేకంగా కోర్టు బెయిల్ నిరాకరించింది. తాజాగా అనారోగ్యం కారణంగా తనకు బెయిల్ ఇవ్వాలంటూ కవిత మరోసారి సుప్రీం కోర్టు మెట్లు ఎక్కింది. కాగా ఇప్పటికే ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో పాటు ఎంపీ సంజయ్ సింగ్‌, అభిషేక్ బోయినపల్లికి సుప్రీం కోర్టు షరతులతో కూడిన బెయిల్ ను మంజూరు చేసిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో ఎమ్మెల్సీ కవితకు కూడా బెయిల్ వస్తుందని బీఆర్ఎస్ శ్రేణులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. మరి కవితకు సుప్రీం కోర్టు జైలు గోడల నడుమ నుంచి విముక్తి కల్గిస్తుందా? లేదా? అనేది వేచి చూడాలి.  

బెయిల్ వస్తే విలీనం తప్పదా?

ఒకవేళ ఎమ్మెల్సీ కవితకు లిక్కర్ స్కామ్ కేసులో బెయిల్ వస్తే గతంలో ఆర్టీవీ చెప్పిందే నిజమవుతుందని రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జోరుగా సాగుతోంది. బీఆర్ఎస్ బీజేపీ విలీనం నూరు శాతం నిజం అనే భావన ఇప్పటికే ప్రజల్లో నెలకొంది. అయితే ఆర్టీవీ చెప్పింది ఏంటి ?... దేశ రాజకీయాల్లో ఎవరు ఊహించని ఒక సంచలన విషయాన్ని ఆర్టీవీ బట్టబయలు చేసింది. నాలుగు గోడల మధ్య రహస్యంగా జరుగుతున్న చర్చలను ప్రజల ముందు తెచ్చింది. త్వరలో బీఆర్ఎస్ పార్టీ బీజేపీలో విలీనం కాబోతుందని చెప్పి సంచలనం సృష్టించింది. లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై బెయిల్ రాక జైలులో మగ్గుతున్న తన కూతురు ఎమ్మెల్సీ కవితను బయటకు తెచ్చేందుకు, ఎన్నికల్లో ఓటమి తరువాత నేతల ఫిరాయింపులను ఆపేందుకు కేసీఆర్.. తన పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు సిద్ధమయ్యారు.

ఇప్పటికే ఈ విలీనం ప్రక్రియ మొదలు కాగా ఢిల్లీ ఎన్నికల తరువాత ఈ విలీనం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ విలీనంతో గత ఐదు నెలలుగా జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితకు లిక్కర్ స్కామ్ కేసులో బయటకు రానుంది. మరోవైపు బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయడాన్ని బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ వ్యతిరేకిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ కేసీఆర్ మాయలో పడి విలీనం చేస్తే తెలంగాణలో బీజేపీ కనుమరుగు అవుతుందని వారు అధిష్టానాన్ని కోరుతున్నారట. ఈ విలీనం జరుగుతుందా ?  లేదా ? అని తెలంగాణ రాష్ట్రంతో సహా యావత్ దేశం వేచి చూస్తోంది.

Advertisment
తాజా కథనాలు