MLC Kavitha: కోర్టులో వర్చువల్‌గా హాజరైన ఎమ్మెల్సీ కవిత

TG: లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీట్‌పై ఈరోజు రౌస్ అవెన్యూ కోర్టులో విచారణ జరిగింది. విచారణకు కవిత, మనీష్ సిసోడియా, ఇతర నిందితులు వర్చువల్‌గా హాజరయ్యారు. ఈ కేసుపై విచారణను వచ్చే నెల 11కు కోర్టు వాయిదా వేసింది.

Kavitha: కవిత జైలుకెళ్లి నేటికి 100 రోజులు.. బెయిల్ సంగతేంటి !
New Update

MLC Kavitha: లిక్కర్ స్కామ్ కేసు సీబీఐ ఛార్జిషీట్‌పై ట్రయల్ కోర్టులో విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణను 11 సెప్టెంబర్‌కు జడ్జి కావేరి భవేజా వాయిదా వేశారు. ట్రయల్ కోర్ట్ విచారణకు ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, ఇతర నిందితులు వర్చువల్‌గా హాజరయ్యారు. సీబీఐ దాఖలు చేసిన చార్జి షీట్ లో కొన్ని డాక్యుమెంట్స్ ఫెర్ లేవని, కోర్టు రికార్డుల నుంచి బెస్ట్ క్వాలిటీగా ఉన్న డాక్యుమెంట్స్ డిఫెన్స్ లాయర్లకు ఇవ్వాలని నిందితుల తరపు న్యాయవాదులు ధర్మాసనాన్ని కోరారు. సెప్టెంబర్ 4 లోపు డిఫెన్స్ లాయర్లు అడుగుతున్న డాక్యుమెంట్స్ ను సప్లై చేయాలని సీబీఐని జడ్జి ఆదేశించారు.

ఈరోజు హైదరాబాద్ కు కవిత...

లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన ఎమ్మెల్సీ కవిత నిన్న తీహార్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈరోజు ఆమె హైదరాబాద్ కు చేరుకోనున్నారు. సాయంత్రం హైదరాబాద్‌కు చేరుకుంటారు. మధ్యాహ్నం 2.45 గం.కు ఢిల్లీ నుంచి కవిత బయలుదేరనున్నారు. సాయంత్రం 5 గం.కు శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. ప్రస్తుతం ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ఆమె ఉన్నారు. కవితతో బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, హరీష్ రావు, పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈరోజు ఆమె తన తండ్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ నందినగర్ లోని ఆయన నివాసంలో భేటీ కానున్నట్లు సమాచారం.

#mlc-kavitha
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe