MLC Kavita: జైలులో కవితకు అస్వస్థత

తీహార్ జైలులో ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. ఆమె వైరల్ ఫీవర్ భారిన పడ్డట్లు తెలుస్తోంది. దీంతో రేపు ఢిల్లీకి కేటీఆర్, హరీష్ రావు వెళ్లనున్నట్లు సమాచారం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే.

MLC Kavitha: కవిత ఎక్కడికీ పారిపోరు.. సిసోడియా బెయిల్ అంశాలే ఆమెకు వర్తిస్తాయి: ముకుల్ రోహత్గీ
New Update

MLC Kavita: తీహార్ జైలులో మరోసారి ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. ఆమె వైరల్ ఫీవర్ భారిన పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెకు ఢిల్లీలోని ఎయిమ్స్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు జైలు సిబ్బంది. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ కవితను పరామర్శించేందుకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టైన కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. కాగా ఈ కేసులో కవితను మార్చి 15న ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

బెయిల్ కోసం ఎదురుచూపులు...

లిక్కర్ స్కామ్ కేసులో గత ఐదు నెలలుగా జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితకు ఇటీవల నిరాశే ఎదురైంది. తనకు అనారోగ్యం కారణంగా ఈడీ, సీబీఐ కేసుల్లో బెయిల్ ఇవ్వాలని కోరుతూ కవిత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది. ఈ కేసులో కవిత బెయిల్ కు వ్యతిరేకంగా సీబీఐ కౌంటర్ పిటిషన్ దాఖలు చేయగా.. ఈడీ చేయలేదు. తమకు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇవ్వాలని ధర్మాసనాన్ని కోరగా.. ఈడీ అభ్యర్థన మేరకు కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం ఇచ్చింది సుప్రీం కోర్టు. గురువారంలోపు కౌంటర్ దాఖలు చేయాలని ఈడీని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. 

#kavitha
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి