బీఆర్ఎస్ అధిష్ఠానం దాదాపు సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వడంతో పలు చోట్ల అసమ్మతి నేతలు గత కొన్ని రోజుల నుంచి ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అయితే 2018లో నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిచిన జైపాల్ యాదవ్‌పై.. ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి తీవ్రంగా విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్‌లో తనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదనే కారణంతో నారాయణ రెడ్డి ఇటీవలే కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. అయితే ఈసారి ఎన్నికల్లో కూడా జైపాల్ యాదవ్‌కు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వడంపై నారాయణ రెడ్డి మండిపడ్డారు. 2018లో జైపాల్ యాదవ్ గెలుపు కోసం పనిచేశామని.. కానీ చివరికి తననే దూరం పెట్టారని అందుకే కాంగ్రెస్‌లోకి వెళ్లినట్లు తెలిపారు. జైపాల్ యాదవ్‌ను తాను ఎప్పుడూ కూడా ఇబ్బంది కలిగించలేదని.. ఆయనే తనను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు. బయట తిరగకూడదని.. ఎక్కడికీ రాకూడదని తనతో చెబుతుండేవాడని అన్నారు. జైపాల్ యాదవ్ కల్వకుర్తి నియోజకవర్గానికి నిధులు తీసుకురాలేదని.. మళ్లీ ఇప్పుడు ఎమ్మెల్యేగా అయి ఏం చేస్తారంటూ ప్రశ్నించారు కసిరెడ్డి నారాయణ రెడ్డి. నియోజకవర్గలో జైపాల్ యాదవ్ ఎలాంటి అభివృద్ధి చేయకున్న బీఆర్ఎస్ అధిష్ఠానం మళ్లీ ఆయనకే టికెట్ ఇచ్చిందంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కల్వకుర్తికి కనీసం జూనియర్ డిగ్రీ కళాశాలలు కూడా తీసుకురాలేకపోయారని.. ఇప్పటికీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం అంసపూర్తిగా ఉందని ఆరోపించారు. ఇందుకోసం భూములు ఇచ్చిన చాలామంది రైతులకు డబ్బులు రాలేవని అన్నారు. వాళ్లకి దాదాదు 25 కోట్ల రూపాయలకు రావాల్సి ఉన్నాయని తెలిపారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే.. పాఠశాలలు, కళాశాలలు ఏర్పాటు చేసి విద్యావ్యవస్థను పటిష్ఠం చేయడంతో పాటు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానంటూ వ్యాఖ్యానించారు. మరిన్ని వివరాల కోసం ఈ ఇంటర్వ్యూని చూడండి.