MLC Kasireddy: కసిరెడ్డితో కాంగ్రెస్‌లో చేరేది వీళ్లే..!!

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి(Kasireddy Narayana Reddy), ఆయన అనుచరుడు నాగర్‌కర్నూల్‌ జెడ్పీ వైస్ ఛైర్మన్ బాలాజీ సింగ్ సహా పలువురు ముఖ్యనేతలు నేడు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. ఢిల్లీలో మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు.

MLC Kasireddy: కసిరెడ్డితో కాంగ్రెస్‌లో చేరేది వీళ్లే..!!
New Update

ఇప్పటికే బీఆర్‌ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా పరిషత్ వైఎస్ చైర్మెన్ బాలాజీసింగ్ కూడ బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. వచ్చే ఎన్నికల్లో కల్వకుర్తి అసెంబ్లీ స్థానం నుండి బీఆర్ఎస్ టిక్కెట్టును ఆశించారు కసిరెడ్డి నారాయణ రెడ్డి. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ కే కేసీఆర్ టిక్కెట్టును కేటాయించారు.దీంతో కసిరెడ్డి నారాయణ రెడ్డి అసంతృప్తితో చెందారు.

గత కొంతకాలం నుండి ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి కల్వకుర్తి అసెంబ్లీ స్థానం నుండి పోటీకి రంగం సిద్దం చేసుకుంటున్నారు. అయితే కల్వకుర్తి టిక్కెట్టు దక్కకపోవడంతో కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ క్రమంలోనే  టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. రేవంత్ రెడ్డితో భేటీ అయిన తర్వాత కసిరెడ్డి నారాయణ రెడ్డి బీఆర్ఎస్ కు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్ కు పంపారు కసిరెడ్డి నారాయణ రెడ్డి. కల్వకుర్తి అసెంబ్లీ స్థానం నుండి కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్ధిగా బరిలోకి దిగే అవకాశం ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు.బీఆర్ఎస్ లో చేరడానికి ముందు కసిరెడ్డి నారాయణ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్న విషయం తెలిసిందే.

ఇప్పటికే, కర్ణాటక గెలుపుతో ఫుల్ జోష్ లో ఉన్న కాంగ్రెస్ తెలంగాణలోనూ అధికారం దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణలో పొలిటికల్ హీట్ పెరిగింది.  త్వరలోనే ఎన్నికల షెడ్యూల్ విడుదల కానున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలన్నీ రంగంలోకి దిగుతున్నాయి. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ (BRS) అభివృద్ధి పనులతో పాటు ప్రచారంపై కూడా దృష్టిపెట్టింది. ఇక జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పక్కాగా వ్యూహలను రచించే పనిలో ఉన్నాయి. ప్రత్యేక రాష్ట్రం ఇచ్చిన పార్టీగా ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో (Telangana) అధికారాన్ని దక్కించుకోవాలని కాం‍గ్రెస్‌ ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ గెలుస్తుందని ప్రజల్లో ప్రచారం జరుగుతుండడంతో.. పార్టీలో చేరేవాళ్లు అధికం అవుతున్నారు.

Also Read: ముఖ్యమంత్రి అల్పాహార పథకం ప్రారంభం

#t-congress #mlc-kasireddy-narayan-reddy #revanth-reddy #delhi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe