AP: దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో మరో ట్విస్ట్.. వివాదంలోకి మరో కొత్త వ్యక్తి ఎంట్రీ! దువ్వాడ శ్రీనివాస్ ఫ్యామిలీ వివాదంలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. టెక్కలిలో దువ్వాడ ఇల్లు నిర్మించిన స్థలం తనదేనని చింతాడ పార్వతీశ్వరరావు అనే వ్యక్తి చెబుతున్నారు. ఈ విషయంలో తనకు రూ.60 లక్షలు రావాల్సి ఉందన్నారు. ఈ డబ్బులు ఇవ్వకుండా పంపకాలపై చర్చలు ఏంటని ఫైర్ అయ్యారు. By Jyoshna Sappogula 14 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం New Update షేర్ చేయండి MLC Duvvada Srinivas: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా, దువ్వాడ ఫ్యామిలీ డ్రామాలో మరో ట్విస్ట్ చోటుచేసుకుంది. దువ్వాడ ఉంటున్న ఇంటి స్థలం తనదేనంటున్నారు చింతాడ పార్వతీశ్వరరావు అనే వ్యక్తి. టెక్కలిలో దువ్వాడ శ్రీనివాస్ కొత్తగా కట్టిన..ఇంటి స్థలం తనదని.. ఎవరి స్థలాన్ని ఎవరు పంచుకుంటున్నారని పార్వతీశ్వరరావు ప్రశ్నించారు. దువ్వాడ తనకు ఇంకా రూ.60 లక్షలు బాకీ ఉన్నారన్నారు. 22 సెంట్ల స్థలాన్ని కోటీ 20 లక్షలకు అమ్మానన్నారు. తనకు పూర్తిగా డబ్బులు ఇవ్వకుండా..ఇంటిని పంచుకోవడం ఏంటని పార్వతీశ్వరరావు నిలదీశారు. Also Read: ఖమ్మంలో దారుణం.. మనవడిని అమ్మేసిన నానమ్మ.! కాగా, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, వాణి వివాదంపై వారి బంధువులు రాజీ కుదర్చడానికి చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దువ్వాడ శ్రీనివాస్‌కు భార్య వాణి (Vani) తన ఐదు డిమాండ్స్ ను ముందుంచారు. 1. పర్లాకిమిడిలోని 20 కోట్ల విలువైన గ్రానైట్ ఫ్యాక్టరీతో పాటు..దానిపై 40 లక్షల రుణం క్లియర్ చేసి ఇవ్వాలని.. 2. టెక్కలి, వెంకటేశ్వర కాలనీలోని 6 కోట్ల విలువైన పాత ఇంటిపై..15 లక్షల బ్యాంకు రుణం క్లియర్ చేసి ఇవ్వాలని..3. పిల్లల చదువులు, వారి మెయింటెనెన్స్ శ్రీనివాస్ చూసుకోవాలని..4. విడాకుల అంశాన్ని సామరస్యంగా కోర్టులో పరిష్కరించుకోవాలని..5. కొత్త ఇంటిని, శ్రీనివాస్ తదనంతరం తమకు ఇస్తామని.. తక్షణం వీలునామా రాసి ఇవ్వాలని కోరారు. Also Read: అన్నమయ్య జిల్లాలో పరువు హత్య కలకలం.. పేరెంట్సే చంపేశారా? అయితే, తొలి 4 డిమాండ్లకు ఒప్పుకున్న దువ్వాడ శ్రీనివాస్ ఐదో డిమాండ్ కు మాత్రం ఒప్పుకోలేదు. తనకంటూ మిగిలిన కొత్త ఇంటిపై తక్షణమే వీలునామా రాస్తే.. తనకు జరగరానిది ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటని ఐదో డిమాండ్ కు నిరాకరించారు. ఇలా ఐదో డిమాండ్ దగ్గర దువ్వాడ కుటుంబం పంచాయితీ ఆగింది. ఈ నేపథ్యంలోనే చింతాడ పార్వతీశ్వరరావు తన ఇంటిపై స్పందించడంతో మరో మలుపు చోటుచేసుకుంది. #mlc-duvvada-srinivas #divvala-madhuri #vani మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి