Balmuri Venkat Comments on Harish rao: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావుపై కాంగ్రెస్ నాయకుడు, ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ సంచలన ఆరోపణలు చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య రాజకీయం రసవత్తరంగా నడుస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ రోజు హైదరాబాద్ గన్ పార్క్ వద్దనున్న అమరవీరుల స్థూపాన్ని ఇరు పార్టీల నేతలు సందర్శించి తెలంగాణ కోసం ప్రాణాలు వదిలిన అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రాజీనామా సవాల్ ను స్వీకరిస్తూ లేఖతో గన్ పార్క్ వద్దకు వచ్చారు హరీష్ రావు. అయితే మీడియాతో మాట్లాడి హరీష్ వెళ్లిపోయిన అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలతో స్థూపం దగ్గరకు చేరకున్న బల్మూర్ వెంకట్ గద్దెను పసుపు నీళ్లతో శుద్ధి చేశారు.
హంతకుడి రాకతో ఈ ప్రాంతం మైల పడింది..
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన వెంకట్.. అమరవీరుల చవుకు హరీష్ రావు కారణమన్నారు. ఉద్యమ సమయంలో నిరుద్యోగులను, యువతను పొట్టనపెట్టుకున్న హంతకుడంటూ అమరవీరుల స్థూపం వద్దకు రావడంతో ఈ ప్రాంతం మైల పడిందన్నారు. అందుకే తాను పసుపు నీళ్లతో శుద్ధి చేసినట్లు తెలిపారు. 10 ఏళ్లుగా హరీష్ రావు, బీఆర్ఎస్ నాయకులకు ఏనాడు అమరవీరులు గుర్తుకు రాలేదు. హరీష్ రావు బీఆర్ఎస్ లో ఒక జీతగాడు మాత్రమే. రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు 15 వరకు ఏకకాలంలో రుణమాఫీ చేసి తీరుతారు. హరీష్ రావు స్పీకర్ ఫార్మాట్లో కాకుండా రాజీనామా లేఖను రాజకీయం చేశారు. హరీష్ రావు రాజీనామా లేక వృధా కానివ్వను. ఆగస్టు 15 తర్వాత కచ్చితంగా రాజీనామాను ఆమోదింపజేసే బాధ్యత నేను తీసుకుంటా. శాసనసభ వ్యవహారాల మంత్రిగా పని చేసిన నువ్వు రాజీనామా ఎలా చేయాలో కూడా తెలీదా? కేవలం రాజకీయం కోసం వచ్చి డ్రామాలు అడుతున్నావా? అంటూ మండిపడ్డారు.
ఇది కూడా చదవండి: AP-TS : ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థుల ఆస్తుల చిట్టా.. అత్యంత ధనవంతులు వీరే!
కేసీఆర్ గారితో చెప్పించాలని డిమాండ్..
ఇక ఆగస్ట్ 15వ తేదీ లోగా 2లక్షల రుణమాఫీ చేస్తే సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పిన్నట్లు బీఆర్ఎస్ రద్దు చేస్తారో లేదో కేసీఆర్ గారితో చెప్పించాలని డిమాండ్ చేశారు. హరీష్ రావు గారు ఆగస్ట్ 15 తర్వాత మీ రాజీనామా ఆమోదం చెందేలా ఎమ్మెల్సీగా నేను బాధ్యత తీసుకుంటా. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే దొంగల వచ్చి వెళ్ళడం కాదు. పదేళ్లలో మీరు ఏం చేశారో చెప్పండి. రండి ఎమ్మెల్సీగా నేను మీకు సవాల్ విసురుతున్నానంటూ తనదైన స్టైల్ విమర్శలు గుప్పించారు.