AP: కలెక్టర్‌కు ఎమ్మెల్యే వినతి పత్రం.. కార్పొరేషన్ నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు.!

కాకినాడ కార్పొరేషన్ నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టాలని కలెక్టర్‌కు ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వినతి పత్రం అందించారు. వైసీపీ ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కార్పొరేషన్ స్మార్ట్ సిటీ నిధులను ఇష్టానురీతిలో దుర్వినియోగం చేశారని ఆరోపించారు.

New Update
AP: కలెక్టర్‌కు ఎమ్మెల్యే వినతి పత్రం.. కార్పొరేషన్ నిధుల దుర్వినియోగంపై ఫిర్యాదు.!

MLA Vanamadi Kondababu: కాకినాడ జిల్లా కలెక్టర్‌కు కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు వినతి పత్రం అందజేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో కాకినాడ కార్పొరేషన్ నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. 2019 నుండి 2024 వరకు జరిగిన కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ నిధులు, స్మార్ట్ సిటీ నిధులు దుర్వినియోగంపై విచారణ చేపట్టి తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Also Read: పిల్లలే పని మనుషులు.. గురుకులంలో వెట్టిచాకిరి చేస్తున్న విద్యార్థులు.!

ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి.. కార్పొరేషన్ స్మార్ట్ సిటీ నిధులను ఇష్టాను రీతిలో దుర్వినియోగం చేశారని ఆరోపించారు. కాకినాడ నగర ప్రజలు తమ కష్టార్జితాన్ని పన్నుల రూపంలో కార్పొరేషన్ కు చెల్లిస్తే వాటిని సక్రమంగా ప్రజలకు ఉపయోగపడే పనులు నిర్వహించకుండా, కాసుల కక్కుర్తితో కాకినాడ నగర ప్రజలకు సంబంధం లేని పనులకు వినియోగించి కార్పొరేషన్ నిధులను దుర్వినియోగం చేశాడని పేర్కొన్నారు. కార్పొరేషన్ నిధులు దుర్వినియోగంపై సమగ్ర విచారణ చేపట్టాలని కోరినట్లు తెలిపారు.

Advertisment
తాజా కథనాలు