MLA Thopudurthi Prakash Reddy: రాప్తాడు నియోజకవర్గంలోని రోడ్ల దుస్థితిపై ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి(Thopudurthi Prakash Reddy) సీరియస్ గా స్పందించారు. నియోజకవర్గంలోని 33 గ్రామల్లో రోడ్డు నిర్మాణ పనులు వెంటనే చేపట్టాలని డిమాండ్ చేశారు. రోడ్డు నిర్మాణ పనుల కాంట్రాక్ట్ ను పరిటాల సునీత(Paritala Sunitha) కుటుంబీకులు దక్కించుకున్నారని, అయితే, ఇన్నేళ్లు గడుస్తున్నా రాప్తాడులోని పలు గ్రామాల్లో రోడ్డే వేయడం లేదని విమర్శలు గుప్పించారు.
Also Read: ‘మోదీని గద్దె దించాలి, జగన్ ను ఇంటికి పంపించాలి’.!
సునీత సొంత కంపెనీ పక్క నియోజకవర్గాల్లో రోడ్లు వేస్తోంది గాని రాప్తాడు నియోజకవర్గం లో రోడ్లు వేయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం హయాంలో మంత్రిగా ఉన్న పరిటాల సునీత రోడ్డు ఎందుకు పూర్తి చేయలేదని ప్రశ్నించారు. వచ్చే సోమవారం నాటికి రాప్తాడు నియోజకవర్గంలోని 33 గ్రామల్లో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభించకపోతే పరిటాల సునీత, కాంట్రాక్టర్ ఇంటిముందు ధర్నా చేస్తామని ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డి హెచ్చరించారు.
Also Read: ఎమ్మెల్సీ మృతిపై టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపం.!
జీడిపల్లి అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు సంబంధించి 590 కోట్ల వర్క్ మేఘ ఇంజనీరింగ్ కంపెనీ తీసుకుందని.. కానీ, 170 కోట్ల వర్క్ మాత్రమే చేసి మిగిలిన వర్క్ పూర్తి చేయలేదని మండిపడ్డారు. డబ్బులు ఇచ్చినప్పటికీ పనులు పూర్తి చేయలేదని ఆరోపించారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా మెగా ఇంజనీరింగ్ కంపెనీకి నోటీస్ పంపిస్తామని వార్నింగ్ ఇచ్చారు. నియోజకవర్గంలో రోడ్డు పూర్తి చేశాకే 2024 ఎన్నికల్లో రాప్తాడు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా ఎన్నికలకు వెళ్తానని చెప్పారు. పరిటాల సునీత నిజ స్వరూపాన్ని ప్రజలకు తెలియజేస్తానని కామెంట్స్ చేశారు.