Nandyala: నంద్యాల జిల్లా మహానంది మండలం సీతారామపురం గ్రామంలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్ర పాణి రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలో బుడ్డారెడ్డి శ్రీనివాస రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన చేసే అక్రమాలకు పుల్ స్టాప్ పెట్టాలనే గ్రామానికి వచ్చానన్నారు. పేదల భూములను లాక్కుని దోపిడీ చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: అందుకే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్నా: మీసాల గీత
శ్రీనివాస రెడ్డి ఫ్యాక్టరీ కోసం పొలాలను దౌర్జన్యం చేసి లాక్కున్నాడని ఆరోపించారు. ప్రభుత్వ పథకాల్లో రేషన్ బియ్యం లాంటివి వారి ఇంటి దగ్గరికి వెళ్ళి పర్సంటేజ్ ఇచ్చి ప్రజలు తెచ్చుకోవాలని చెప్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీ ప్రజలను ఇంటికి పిలిచి శ్రీనివాస రెడ్డి బయపేడుతున్నారని నిప్పులు చెరిగారు.
Also Read: జగన్‌పై దాడి.. భారీగా భద్రత పెంపు
ఇక్కడ ప్రజలకు అండగా ఉంటానన్నారు. ఎవరు భయపడాల్సిన అవసరం లేదన్నారు. అధికారంలోకి వచ్చాక ఫ్యాక్టరీని పడగొడతామన్నారు. ఊర్లో గుడి కట్టాలని 1600 ఎకరాల ఉంటే ఎకరాకు రూ.6 వేలు వసూలు చేశాడని మండిపడ్డారు.