MLA Rapaka: 'రాజోలులో వైసీపీ నుండి నాకు పోటీనే లేదు'.. ఎమ్మెల్యే ధీమా.! వై నాట్ 175లో రాజోలు నుండి రాపాక ఉండబోతున్నాడని క్లారిటీ ఇచ్చారు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. రాజోలులో వైసీపీ నుండి తనకు పోటీ వచ్చే సరైన క్యాండిడేట్ లేడని ధీమా వ్యక్తం చేశారు. కొంతమంది కావాలని తనకు సీటు లేదని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. By Jyoshna Sappogula 04 Jan 2024 in ఆంధ్రప్రదేశ్ తూర్పు గోదావరి New Update షేర్ చేయండి MLA Rapaka Vara Prasada Rao: Rtvతో రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ ఎక్సక్లూసివ్ గా మాట్లాడారు. వై నాట్ 175లో రాజోలు నుండి రాపాక ఉండబోతున్నాడని క్లారిటీ ఇచ్చారు. సర్వేలు ఆధారంగా వైసీపీ సీట్లు మార్పులు చేస్తున్నారని అంతే తప్ప ఎవరికి అన్యాయం చేసే ఉద్దేశం సీఎం జగన్ మోహన్ రెడ్డి గారికి లేదని వివరించారు. అన్యాయం జరిగినవారికి న్యాయం చెయ్యాలి అంటే ప్రభుత్వం అధికారంలోకి రావాలని కామెంట్స్ చేశారు. Also Read: లోకేష్ కు షాక్.. చిన్నారులపై హింసను ప్రేరేపిస్తున్నారంటూ పిటిషన్ దాఖలు నాకు పోటీ వచ్చే సరైన క్యాండిడేట్ లేడు.. సీఎం జగన్ అనుకున్నా 175 లక్ష్యం చేరాలంటే అందరూ కలిసి పనిచెయ్యాలని పిలుపునిచ్చారు. కొత్త ముఖాలను పరిచయం చేయటం కోసమే సీఎం జగన్ ఈ మార్పులు చేస్తున్నట్లు తెలిపారు. రాజోలులో వైసీపీ నుండి తనకు పోటీ వచ్చే సరైన క్యాండిడేట్ లేడని ధీమ వ్యక్తం చేశారు. తాను ప్రజల్లో గడపగడపకు తిరిగుతూ నిత్యం ప్రజల్లో ఉంటున్నానట్లు తెలిపారు. అందుకే జనసేనలో గెలిచాను.. ఎన్నికలకు సిద్ధంగా ఉండు సీటు కన్ఫామ్ అని సీఎం జగన్ మోహన్ రెడ్డి తనకు చెప్పినట్లు వెల్లడించారు. అయితే, కొంతమంది కావాలని తనకు సీటు లేదని ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల్లో వైసీపీ నుండి జగన్ మోహన్ రెడ్డి పథకాల ద్వారా వచ్చే ఓటింగ్ ఉందని..రాజోలులో వ్యక్తి గతంగా తనకు కొంత ఓటింగ్ ఉందని వ్యాఖ్యనించారు. గతంలో తాను జనసేన నుండి పోటీ చేసిన అందుకే గెలవడం జరిగిందని వివరించారు. పొత్తుకు భయపడేదే లేదు.. ఈ క్రమంలోనే జనసేన టీడీపీపై విమర్శలు గుప్పించారు. టీడీపీ జనసేన పొత్తుకు భయపడేదే లేదని తేల్చిచెప్పారు. వై నాట్ 175 అనేదే మా నినాదం అని..ఈ సారి ఎన్నికల్లోనూ వైసీపీ విజయం సాధిస్తుందని ధీమ వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో వై నాట్ 175లో రాపాక ఉండబోతున్నడని అన్నారు. సీఎంగా మళ్లి జగనే ప్రమాణ స్వీకారం చేస్తారని పేర్కొన్నారు. కాగా, గత ఎన్నికల్లో జనసేన నుండి రాజోలు ఎమ్మెల్యేగా గెలిచిన రాపాక వరప్రసాద్ అనంతరం అధికార పార్టీ వైసీపీలో చేరారు. #andhra-pradesh #mla-rapaka-vara-prasada-rao మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి