Raja Singh: అక్బరుద్దీన్‌ వార్నింగ్‌కు రేవంత్ భయపడ్డారా? రాజాసింగ్ సంచలనం!

అక్బరుద్దీన్‌ వార్నింగ్‌కు సీఎం రేవంత్ భయపడి ఫాతీమా కాలేజీని కూల్చట్లేదని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. 'హైడ్రా కాదు.. హై డ్రామా. ఎంఐఎంతో కాంగ్రెస్ కాంప్రమైజ్ అయిందా? ఆ కాలేజీ కూల్చేదాకా రేవంత్ జీరోనే' అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.

New Update
Raja Singh: అక్బరుద్దీన్‌ వార్నింగ్‌కు రేవంత్ భయపడ్డారా? రాజాసింగ్ సంచలనం!

Hydra: హైడ్రా ఆపరేషన్ పై గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌ సంచలన ఆరోపణలు చేశారు. సీఎం రేవంత్ చేపట్టింది హైడ్రా కాదు.. హై డ్రామా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదొళ్ల ఇళ్లు వెంటనే కూలగొడుతున్న హైడ్రా.. ఫాతీమా కాలేజీని ఎందుకు కూల్చడం లేదని ప్రశ్నించారు. ఎంఐఎంతో కాంగ్రెస్ కాంప్రమైజ్ అయిందా? లేక అక్బరుద్దీన్‌ వార్నింగ్‌కు రేవంత్ భయపడ్డారా? అంటూ తీవ్ర విమర్శలు చేశారు.

ఈమేరకు ఆదివారం మీడియాతో మాట్లాడిన రాజాసింగ్.. ఫాతీమా కాలేజీని ఎప్పుడు కూలుస్తారో సీఎం రేవంత్ చెప్పాలన్నారు. ఫాతిమా కాలేజీని కూలగొట్టే దాకా రేవంత్ జీరోనే అన్నారు. అయితే హైడ్రా అధికారులు ఇప్పటికే ఫాతిమా కాలేజీని పరిశీలించి నోటీసులిచ్చిన విషయం తెలిసిందే. కాగా సలకం చెరువు బఫర్ జోన్‌లోనే ఫాతిమా కాలేజీలున్నాయని, 12 ఫ్లోర్స్‌గా ఫాతిమా కాలేజ్‌ బిల్డింగ్‌లు నిర్మించినట్లు అధికారులు నివేదిక ఇచ్చారు.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు