కంటతడి పెట్టుకున్నఎమ్మెల్యే ముత్తిరెడ్డి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి ప్రెస్‌మీట్‌లో బాగోద్వేగానికి లోనై కంటతడి పెట్టున్నారు. కావాలనే మానసికంగా నా మనోస్థైర్యం దెబ్బ తీయడం కోసం నాపై చేస్తున్న కుట్రలు. నేనేంటో అధిష్టానికి తెలుసు కాబట్టి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా మళ్ళీ గెలుస్తా అని దీమా వ్యక్తం చేశారు. By Vijaya Nimma 19 Jun 2023 in రాజకీయాలు తెలంగాణ New Update షేర్ చేయండి జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఓ ప్రెస్‌మీట్‌లో కంటతడి పెట్టుకున్నారు. తన కుమార్తెను రాజకీయ ప్రత్యర్థులు తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. తమ కుటుంబ సమస్యను ప్రత్యర్థులు పావుగా వాడుకుంటున్నారని విమర్శించారు. ఈ క్రమంలోనే తన మనోస్థైర్యం దెబ్బతీసే కుట్ర జరుగుతోందని అన్నారు. ఈ నేపథ్యంలోనే ఇంటి సమస్యను రాజకీయం చేయటం సరికాదని హితవు పలికారు. తన సొంత ఆస్తి.. కూతురుకి ఇస్తే మోసం ఎలా అవుతుందని ప్రశ్నించారు. ప్రజాక్షేత్రంలో తప్పు చేస్తే ప్రజలే బుద్ధి చెప్తారని.. ఎవరెన్ని కుట్రలు చేసినా మళ్లీ గెలుస్తానని ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి స్పష్టం చేశారు. ఫోర్జరీ జరగలేదు గతంలో కుమార్తె భవానీ తన సంతకాన్ని.. తండ్రి ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి ఫోర్జరీ చేశారని ఉప్పల్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే సిద్ధిపేట జిల్లా చేర్యాలలో తన పేరిట ఉన్న భూమిని ఆయన పేరు మీదకు మార్చుకున్నారని తెలిపారు. ఇదే విషయంపై ముత్తిరెడ్డి వివరణ ఇచ్చారు. చేర్యాలలో 1200 గజాల భూమి తన బిడ్డ పేరుపైనే ఉందని.. ఎటువంటి ఫోర్జరీ జరగలేదని ఆయన పేర్కొన్నారు. ప్రత్యర్థులు చేస్తున్న కుట్ర తనను ప్రజా క్షేత్రంలో బాదనం చేయాలన్న దానిపై ప్రత్యర్థుల చేస్తున్న కుట్రగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి పేర్కొన్నారు. రాజకీయంగా దెబ్బతీసేందుకు కొందరు ఇంటి సమస్యను బయటికి తీస్తున్నారని ఆరోపించారు. అంతేకాకుండా ప్రతి ఇంట్లో ఆస్తుల సమస్య ఉంటుంది. కానీ.. ఇంటి సమస్యను రాజకీయంగా వాడుకుంటున్నారని మండిపడ్డారు. గత ఎన్నికల సమయంలో నేను కబ్జా చేశానని ఓ జిల్లా కలెక్టర్ అన్నారు. అయితే ఆ మాటలను తన నియోజకవర్గ ప్రజలు నమ్మ లేదని తెలిపారు. ప్రజాక్షేత్రంలో తప్పు చేస్తే ప్రజలే బుద్ధి చెప్తారు నేనేంటో.. నా ప్రవర్తన ఏంటో మా సీఎం కేసీఆర్‌కు తెలుసన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక కుటుంబాలను వెలికితీస్తున్నారని.. తన అల్లుడు, బిడ్డను ఉసిగొల్పి బధనం చేసేందుకు కొందరు రాజకీయ ప్రత్యర్ధులు చేస్తున్న కుట్రగా విమర్శించారు. అలా నన్ను బదనాం చేయాలని చేస్తే.. వారికి పిల్లలు ఉన్నారు. ఏదొక రోజు పాపం పండుతుందని.. ఇది మంచి పద్ధతి కాదని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి తెలిపారు. అంతేకాకుండా తనపై ఎవరైతే ఈ రాజకీయ కుట్రలు చేస్తున్నారో వాళ్ల ఆటలు సాగవు, నేనేంటో ప్రజలకు తెలుసు ముఖ్యమంత్రికు తెలుసన్నారు. నా కట్టే ఇక్కడే కాలుతుంది, నా చితి బస్పం నియోజకవర్గంలోని 176 చెరువుల్లో కలపాలి, అప్పుడే తన ఆత్మ శాంతిస్తుందని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మరోసారి వ్యాఖ్యలు చేశారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి