MLA Maganti Gopinath: ఎమ్మెల్యే మాగంటి పీఏ చేసిన దాడిని ఖండిస్తున్న దళిత సంఘాలు! ఒక వ్యక్తి పై ఐదుగురు వ్యక్తులు దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో వచ్చిన దృశ్యాల ఆధారంగా ఈ కేసును సుమోటోగా స్వీకరించమని జుబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ ఆర్టీవీతో మాట్లాడారు. By Bhavana 11 Oct 2023 in క్రైం తెలంగాణ New Update షేర్ చేయండి MLA Maganti Gopinath PA Bhaskar: జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ అనుచరుడు, పీఏ భాస్కర్ తన స్నేహితులతో కలిసి ఓ వ్యక్తిని విచక్షణా రహితంగా కొట్టిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. దాడికి గురైన వ్యక్తిని గుంటూరు కు చెందిన చందుగా పోలీసులు గుర్తించారు.ఈ విషయం గురించి జుబ్లీహిల్స్ ఇన్‌స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ ఆర్టీవీతో మాట్లాడారు. ఒక వ్యక్తి పై ఐదుగురు వ్యక్తులు దాడి చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సోషల్ మీడియాలో వచ్చిన దృశ్యాల ఆధారంగా ఈ కేసును సుమోటోగా స్వీకరించమని ఆయన వివరించారు. చందు అనే వ్యక్తి మీద కొందరు వ్యక్తులు దాడి చేస్తున్నట్లు ఆ వీడియోలో ఉంది. దాడి చేసిన వారిలో భాస్కర్, లలిత్ అనే వ్యక్తులను అదుపులోనికి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. Also read:ఈ శనివారం ఆకాశంలో అద్భుతం..సూర్య గ్రహణం రోజు ఏం జరగనుందంటే? మొత్తం ఐదుగురి మీద ఐపీసీ 307 కింద కేసు నమోదు చేసినట్లు ఆయన వివరించారు. ఇద్దరు నిందితులు అదుపులో ఉండగా..మరో ముగ్గురు నిందితులు పరారీలో ఉన్నట్లు తెలిపారు. శనివారం అర్థరాత్రి సమయంలో లక్ష్మీ నరసింహ నగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. చందు ఆ సమయంలో ఓ మహిళతో ఉండగా..అటుగా వచ్చిన లలిత్ వారిని ఈ సమయంలో ఇక్కడ ఎందుకు ఉన్నారని ప్రశ్నించగా గొడవ మొదలైంది. దీంతో రెచ్చిపోయిన లలిత్ తన స్నేహితుడైన భాస్కర్ మిగిలిన వారికి తెలపగా వారంతా చందు మీద దాడికి దిగారు. తీవ్రంగా గాయపడిన బాధితుడు ఆసుపత్రిలో చికిత్స తీసుకుని తన స్వగ్రామానికి వెళ్లిపోయినట్లు ఆయన తెలిపారు. అయితే భాస్కర్ అనే వ్యక్తి ఎమ్మెల్యే కి పీఏ కాదు అని..కేవలం ఓ కార్యకర్త మాత్రమే అని ఇన్‌స్పెక్టర్ రవీంద్ర ప్రసాద్ తెలిపారు. Also read: బంపర్ ఆఫర్..రూ. 50వేల ఐఫోన్..కేవలం రూ.20వేలకే..వెంటనే కొనేయ్యండి…!! బాధితుడికి నిందితులకు ఎటువంటి పరిచయం లేదు. అతని విచారిస్తే మరిన్ని విషయాలు తెలుస్తాయని ఆయన వివరించారు. పీఏ భాస్కర్ చేసిన దాడిని దళిత సంఘాలు ఖండించాయి. చందు ఆరోగ్య పరిస్థితి పై పోలీసులు స్పష్టం ఇవ్వటం లేదని వారు ఆరోపిస్తున్నారు. బాధితుడు బతికున్నాడా..చనిపోయాడా చెప్పాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే మాగంటి పీఏ భాస్కర్ ను పీఏగా కాకుండా కార్యకర్తగా చిత్రీకరించే పరయత్నం జరుగుతుందని వారు ఆరోపిస్తున్నారు. నిందితులు కావాలనే ఉద్దేశ పూర్వకంగానే దాడి చేసినట్లుగా వారు ఆరోపిస్తున్నారు. నిందితులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. #brs-mla-maganti-gopinath #maganti-gopinath #maganti-gopinath-pa-bhaskar మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి