MLA Kotamreddy: నెల్లూరు జిల్లాలో రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కీలక వ్యాఖ్యాలు చేశారు. అనర్హత వేటు వల్ల మాకు ఎలాంటి నష్టమూ లేదని.. వైసీపీ ప్రభుత్వం సాధించింది ఏమీ లేదని కామెంట్స్ చేశారు. ఏడాది క్రితమే మమ్మల్ని సస్పెండ్ చేసిందని.. సస్పెండ్ చేసిన తర్వాత మాపై అనర్హత వేటు వేసే నైతిక అర్హత వైసీపీ ప్రభుత్వానికి లేదని చెప్పుకొచ్చారు.
Also Read: తీర ప్రాంతానికి కొట్టుకొచ్చిన భారీ తిమింగలం.. చిందులేస్తున్న చిన్నారులు..!
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీ కండువా కప్పుకున్నప్పుడే ఈ నిర్ణయం తీసుకుని ఉండాలని వ్యాఖ్యానించారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణ కరెక్ట్ కాదన్నారు. నియోజకవర్గ సమస్యలపై పోరాడితే మమ్మలని పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనర్హత వేటుకు సంబంధించి తనకు లిఖిత పూర్వక ఉత్తర్వులు ఇంకా అందలేదని చెప్పుకొచ్చారు.
Also Read: ఉండి టీడీపీలో పొలిటికల్ వార్.. నియోజకవర్గంలో ముదురుతున్న రాజు బ్రదర్స్ వర్గ పోరు..!
కాగా, వైసీపీ పాలనపై విసుగుచెందిన కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆ పార్టీ నుండి బయటికి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తరువాత టీడీపీలో చేరారు. నెల్లూరు రూరల్ టీడీపీ ఇంఛార్జిగా నియమితులయ్యారు. పార్టీ కార్యకర్తలతో కలిసి పార్టీ గెలుపు కోసం కృషి చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఏపీలో అసెంబ్లీ ఎన్నికల వేళ స్పీకర్ తమ్మినేని సంచలన నిర్ణయం తీసుకున్నారు. 8మంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు. వైసీపీ, టీడీపీ పార్టీలు ఇచ్చిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ చేపట్టి..న్యాయ నిపుణుల సలహా మేరకు స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
Also Watch This Video: