Liquor Scam: జైల్లోనే... కవిత బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా!

ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌ను రౌస్‌ అవెన్యూ కోర్టు వాయిదా వేసింది. తన కుమారుడికి ఎగ్జామ్స్‌ ఉన్నాయని కవిత బెయిల్‌కు అప్లై చేశారు. కవిత లాయర్‌ అభిషేక్‌ మను సింఘ్వి బెయిల్‌ కోసం వాదించారు. అయితే కోర్టు బెయిల్‌ పిటిషన్‌ను ఈ నెల 4కు వాయిదా వేసింది.

New Update
MLC Kavitha: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్

Kavitha Bail Petition: ఢిల్లీ లిక్కర్‌ స్కామ్‌లో తీహార్ జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ విచారణ వాయిదా పడింది. ఈ నెల 4వరకు విచారణను వాయిదా వేసింది. కుమారుడి పరీక్షల దృష్ట్యా బెయిల్ కావాలని కవిత అడిగారు. కవిత కుమారుడు 12th క్లాస్ చదువుతున్నాడు. కవిత లాయర్‌ అభిషేక్‌ మను సింఘ్వి వాదించారు. అయితే కోర్టు మాత్రం బెయిల్‌ పిటిషన్‌ విచారణను వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై ఏప్రిల్‌ నాలుగున మరోసారి విచారించనుంది. రౌస్‌ అవెన్యూ కోర్టు ఈ మేరకు చెప్పింది.

మరోవైపు తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని చెబుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత. తాను ఏ తప్పూ చేయలేదని... కచ్చితంగా బయటకు వస్తానని కవిత అంటున్నారు. ఇది మనీలాండరింగ్ కేసు కాదని...పొలిటికల్ లాండరింగ్ కేసని అంటున్నారు కవిత. తాత్కాలికంగా తనను జైల్లో పెట్టొచ్చేమో కానీ... తన ఆత్మస్థైర్యాన్ని మాత్రం ఎవరూ దెబ్బ తీయలేరని చెబుతున్నారు కవిత. ఇందులో ఒక నిందితుడు ఇప్పటికే బీజేపీ(BJP) లో చేరాడని.. మరో నిందితుడు బీజేపీ టికెట్‌ పొందాడంటున్నారు. మూడో నిందితుడు ఎలక్టోరల్ బాండ్ల(Electoral Bonds) రూపంలో బీజేపీకి రూ.50కోట్లు ఇచ్చాడని చెప్పుకొచ్చారు. అయితే ఎవరు ఎలా ఉన్నా... తాను మాత్రం క్లీన్‌గా బయటికొస్తానని కవిత అంటున్నారు.

Also Read: అప్పటివరకు అమెరికాలోనే ప్రభాకర్ రావు.. పోలీసులకు కీలక సమాచారం!

Advertisment
తాజా కథనాలు