AP: పంతం నెగ్గించుకున్న ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి..!

ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు. సీఐ లక్ష్మీకాంత్‌తో వీడియో కాల్‌లో సారీ చెప్పించుకున్నారు. తాడిపత్రిలో ఇసుక అక్రమ రవాణా విషయంలో సీఐ, ఎమ్మెల్యే మధ్య గొడవ మొదలైన సంగతి తెలిసిందే. దీంతో సీఐ క్షమాపణ చెప్పాలంటూ అస్మిత్‌రెడ్డి డిమాండ్ చేయగా సీఐ సారీ చెప్పారు.

New Update
AP: పంతం నెగ్గించుకున్న ఎమ్మెల్యే జేసీ అస్మిత్‌రెడ్డి..!

Ananthapuram: అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఇసుక అక్రమ రవాణా విషయంలో సీఐ లక్ష్మికాంత్‌ , ఎమ్మెల్యే అస్మిత్‌ రెడ్డి మధ్య గొడవ మొదలైన సంగతి తెలిసిందే. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వాళ్లపై కేసులు పెట్టాలంటూ సీఐపై ఎమ్మెల్యే అస్మిత్‌రెడ్డి ఒత్తిడి తెచ్చారు. అయితే, సీఐ మాత్రం ఇసుక అక్రమ రవాణా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోకపోవడంతో ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిలదీశారు.

Also Read: అల్లు అర్జున్ కు కూడా ఫ్యాన్స్ ఉన్నారా?.. పుష్ప పరువు తీసిన జనసేన ఎమ్మెల్యే!

దీంతో ఎమ్మెల్యేపై సీఐ దురుసుగా ప్రవర్తించారని నిన్న రూరల్ పోలీస్ స్టేషన్ ముందు ఎమ్మెల్యే అస్మిత్‌రెడ్డి, టీడీపీ శ్రేణులు ఆందోళన చేశారు. సీఐ క్షమాపణ చెప్పాలంటూ అస్మిత్‌రెడ్డి డిమాండ్ చేశారు. అయితే, ఎట్టకేలకు అస్మిత్‌రెడ్డి తన పంతం నెగ్గించుకున్నారు.

Also Read: ఓయో హోటల్‌లో సీక్రెట్ కెమెరాలు.. నిందితుడి ఫోన్‌లో వందల న్యూడ్ వీడియోలు..!

సీఐ లక్ష్మీకాంత్‌తో సారీ చెప్పించుకున్నారు అస్మిత్‌రెడ్డి. వీడియో కాల్‌లో సీఐ లక్ష్మికాంత్‌ ఎమ్మెల్యేకు సారీ చెప్పారు. తాను చేసింది తప్పు అయితే.. తనది తప్పు అని ఎమ్మెల్యే అనుకుంటే సారీ అంటూ అస్మిత్‌రెడ్డికి సీఐ లక్ష్మికాంత్ చెప్పారు. దీంతో ఎమ్మెల్యే తన ఆందోళనను విరమించారు.

Advertisment
తాజా కథనాలు