Hyderabad: ఓయో హోటల్లో సీక్రెట్ కెమెరాలు.. నిందితుడి ఫోన్లో వందల న్యూడ్ వీడియోలు..! శంషాబాద్ సిటా గ్రాండ్ ఓయో హోటల్ లో సీక్రెట్ కెమెరాలు కలకలం రేపాయి. బెడ్ రూంలలో సీక్రెట్ కెమెరాలు ఉంచి జంటల అశ్లీల దృశ్యాలను రికార్డు చేసి నిర్వాహకుడు డబ్బులు డిమాండ్ చేస్తున్నాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నిందితుడి ఫోన్లో వందల న్యూడ్ వీడియోలు బయటపడ్డాయి. By Jyoshna Sappogula 28 Aug 2024 in క్రైం Latest News In Telugu New Update షేర్ చేయండి Hyderabad: హైదరాబాద్ లోని శంషాబాద్ సిటా గ్రాండ్ ఓయో హోటల్లో సీక్రెట్ కెమెరాలు కలకలం రేపాయి. హోటల్‌కు వస్తున్న జంటల అశ్లీల చిత్రాలను నిర్వాహకుడు సీక్రెట్ కెమెరాలతో రికార్డు చేసి బాధితులను బెదిరించి డబ్బులు డిమాండ్ చేసేవాడు. పోలీసులకు ఓ జంట ఫిర్యాదు చేయడంతో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. Also Read: వివాదస్పదంగా మారిన పోలీసుల తీరు..! ఒంగోలుకు చెందిన గణేష్ అనే వ్యక్తి శంషాబాద్ సిటా గ్రాండ్ సమీపంలో ఓయో హోటల్ నడిపిస్తున్నాడు. బెడ్ రూమ్‌లోని బల్బ్ లలో సీక్రెట్ కెమెరాలు ఉంచి జంటల అశ్లీల దృశ్యాలను రికార్డు చేసి.. రికార్డులో ఉన్న వారి వివరాలు ఆధారంగా ఫోన్లు చేసి వారిని బ్లాక్ మెయిట్ చేసేవాడు. అడిగినంత ఇవ్వకుంటే ఆ జంట న్యూడ్ వీడియోలను సోషల్ మీడియాలో పెడతానని బ్లాక్ మెయిల్ చేస్తుండేవాడు. Also Read: వివాదంలో టీడీపీ ఎమ్మెల్యే భర్త.. అధికారంలోకి వచ్చాక సీన్ రివర్స్..! ఇలా ఓ జంటను బెదిరించగా వారు పోలీసులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు హోటల్లో సీక్రెట్ కెమెరాలను స్వాధీనం చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. విచారణలో నిందితుడి ఫోన్లో వందల న్యూడ్ వీడియోలు, చాలా మంది అమ్మాయిల న్యూడ్ ఫోటోలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. #oyo మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి