Harish Rao: కాంగ్రెస్‌ పాలనలో మహిళలపై 1900 అత్యాచారాలు.. హరీష్ రావు ఫైర్

TG: రాష్ట్రంలో హత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయని హరీష్ రావు అన్నారు. 9 నెలల కాంగ్రెస్‌ పాలనలో మహిళలపై 1900 అత్యాచారాలు జరిగాయని చెప్పారు. HYD బ్రాండ్‌ ఇమేజ్‌ను దెబ్బతీస్తున్నారని ఫైర్ అయ్యారు. కేంద్ర హోంశాఖ జోక్యం చేసుకుని రక్షణ వ్యవస్థను పటిష్టం చేయాలని డిమాండ్ చేశారు.

New Update
Harish Rao: పార్టీ ఫిరాయింపులపై ఉన్న శ్రద్ధ రైతులపై లేదు.. హరీష్ రావు ఫైర్

MLA Harish Rao: కాంగ్రెస్ ప్ర్ ప్రభుత్వంపై విమర్శల దాడికి దిగారు బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు. తెలంగాణలో హత్యాచారాలు నిత్యకృత్యం అయ్యయి అని అన్నారు. ఏకంగా కానిస్టేబుల్ మీద ఎస్‌ఐ హత్యాచార యత్నం చేయడం దారుణమని.. ఇలాంటివి అనేక ఘటనలు జరిగాయని అన్నారు. 9 నెలల కాంగ్రెస్ పాలనలో మహిళల పై 1900 హత్యాచారాలు జరిగినట్లు చెప్పారు. ప్రభుత్వం మొద్దు నిద్ర పోతుందని మండిపడ్డారు.

తెలంగాణ వస్తే నక్సలైట్ లు రాజ్యం ఎలుతారని, శాంతి భద్రత కొరవడుతుంది అని అపోహలు సృష్టించారని అన్నారు. 10 ఏళ్ళు తెలంగాణను కేసీఆర్ అద్భుతంగా పాలించారు, శాంతి భద్రతలను పటిష్టంగా అమలు చేశారని కొనియాడారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని దెబ్బతిస్తున్నారు, రాష్ట్ర ప్రతిష్ట మసకబారుతోందని ఫైర్ అయ్యారు. గత కొద్దీ రోజులుగా రాష్ట్రంలో స్మగుల్డ్ వెపన్స్ బయటపడుతున్నాయని అన్నారు. ఒకప్పుడు బిహార్ లో ఉండే నాటు తుపాకులు... ఇవాళ తెలంగాణలో రాజ్యం ఎలుతున్నాయని విమర్శించారు.

2018 నుంచి 2023 వరకు 5 ఏళ్లలో కేవలం 200 నాటు తుపాకులు దొరికాయని.. కొత్త డీజీపీ వచ్చాక 4 మత కలహాలు జరిగాయని అన్నారు. మొత్తం వ్యవస్థ నాశనం అయిందని ధ్వజమెత్తారు. మెదక్ లో సరిగా లేరన్న డీసీపీన తెచ్చి హైదరాబాద్ లో పోస్టింగ్ ఇచ్చారని అన్నారు. కేంద్ర హోమ్ శాఖ జోక్యం చేసుకుని రక్షణ వ్యవస్థను పటిష్ఠం చేయాలని డిమాండ్ చేశారు. డయల్ 100 కూడా పని చేయడం లేదని ఆరోపించారు. పోలీసులన ప్రభుత్వం పని చేయనీయడం లేదని అన్నారు. ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు.

Advertisment
తాజా కథనాలు