YCP MLA: 'పవన్ కళ్యాణే కాదు.. ఎవరు పోటీ చేసినా విజయం నాదే' వైసీపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు.!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. ఆయన వ్యక్తిత్వం చాలా నీచమైందని దుయ్యబట్టారు. ఈ సారి ఎన్నికల్లో భీమవరం నుండి మరోసారి పవన్ కళ్యాణ్ పోటీ చేసినా ఎవరు పోటీ చేసినా విజయం తనదేనని ధీమా వ్యక్తం చేశారు.
MLA Grandhi Srinivas:RTVతో భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఎక్సక్లూసివ్ గా మాట్లాడుతూ పలు కీలక విషయాలు చెప్పుకొచ్చారు. రాజశేఖర్ రెడ్డి ఉన్నపట్టి నుంచి వైఎస్ కుటుంభానికి విధేయుడిగా వున్నట్లు తెలిపారు. తనకు టికెట్ ఇవ్వకపోయి ఉన్నా కూడా వారి కుటుంభాన్ని మాత్రం వదులుకొనన్నారు. సీఎం జగన్ (CM Jagan) నిన్నటి సభలో మరోసారి భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. పదవి చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు 30 రోజులు మాత్రమే తాను అందుబాటులో లేనని.. కనీసం గెలిచాక తిరుపతి వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం కూడా ఎప్పుడూ వెళ్ళలేదన్నారు. ఇటీవల ముక్కోటి ఏకాదశికి మాత్రమే వెళ్ళినట్లు చెప్పారు.
తనకు గతంలో సీఎం ఇంటికీ రమ్మని ఫోన్ చేశారని.. క్యాబినెట్ మంత్రి పదవి ఇస్తానని అన్నారని.. జిల్లా కేంద్రం నరసాపురం చేస్తాను అని చెప్పారని వెల్లడించారు. అయితే, క్యాబినెట్ మంత్రి పదవి వద్దు.. భీమవరం జిల్లా కేంద్రమే కావాలని కోరారన్నారు. భీమవరం జిల్లా కేంద్రం రాకుంటే పదవికి రాజీనామా చేస్తా, నియోజకవర్గంలో బై ఎలక్షన్ వస్తుందని డైరెక్ట్ గా చెప్పినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగానే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. ఆయన వ్యక్తిత్వం చాలా నిచమైందని దుయ్యబట్టారు. లోకేష్, చంద్రబాబు కాళ్ళ మీద పడ్డాడని అన్నారు. పవన్ కళ్యాణ్ కాపులకు అన్యాయం చేశాడని ఆరోపించారు. మొదట్లో పవన్ పై గెలిచానని నేను చాలా గొప్పవాణ్ణి అనుకున్న కానీ, ఒక వ్యక్తిత్వం లేని వ్యక్తి పై, ఒక చిటర్ పై గెలిచనా అని ఇప్పుడు బాధపడుతున్నానని కామెంట్స్ చేశారు. మధర్ థెరిస్సా, అంబేడ్కర్, పూలే వంటి మహనీయుల ఫోటోలు పెట్టుకుని పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్.. ఇప్పుడు వీరందరినీ చంద్రబాబులో చూసుకోండి అని అతని ఫోటో పెట్టుకుని తిరుగుతున్నాడని కౌంటర్లు వేశారు. ఈసారి ఎన్నికల్లో భీమవరం నుండి మరోసారి పవన్ కళ్యాణ్ పోటీ చేసినా ఎవరు పోటీ చేసినా విజయం తనదేనని ధీమ వ్యక్తం చేశారు.
YCP MLA: 'పవన్ కళ్యాణే కాదు.. ఎవరు పోటీ చేసినా విజయం నాదే' వైసీపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు.!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్. ఆయన వ్యక్తిత్వం చాలా నీచమైందని దుయ్యబట్టారు. ఈ సారి ఎన్నికల్లో భీమవరం నుండి మరోసారి పవన్ కళ్యాణ్ పోటీ చేసినా ఎవరు పోటీ చేసినా విజయం తనదేనని ధీమా వ్యక్తం చేశారు.
MLA Grandhi Srinivas: RTVతో భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ ఎక్సక్లూసివ్ గా మాట్లాడుతూ పలు కీలక విషయాలు చెప్పుకొచ్చారు. రాజశేఖర్ రెడ్డి ఉన్నపట్టి నుంచి వైఎస్ కుటుంభానికి విధేయుడిగా వున్నట్లు తెలిపారు. తనకు టికెట్ ఇవ్వకపోయి ఉన్నా కూడా వారి కుటుంభాన్ని మాత్రం వదులుకొనన్నారు. సీఎం జగన్ (CM Jagan) నిన్నటి సభలో మరోసారి భీమవరం ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. పదవి చేపట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు 30 రోజులు మాత్రమే తాను అందుబాటులో లేనని.. కనీసం గెలిచాక తిరుపతి వెంకటేశ్వరస్వామి దర్శనం కోసం కూడా ఎప్పుడూ వెళ్ళలేదన్నారు. ఇటీవల ముక్కోటి ఏకాదశికి మాత్రమే వెళ్ళినట్లు చెప్పారు.
Also Read: ప్రధాని నరేంద్ర మోడీకి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లేఖ.!