MLA Balineni Srinivasa Reddy: ఒంగోలులో ఇళ్ల పట్టాల పంపిణీకి అడ్డురావాలని ప్రయత్నిస్తే ఊరుకునేదే లేదని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. ఒకవేళ పట్టాలు పంపిణీ చేయలేకపోతే వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. పట్టాల పంపిణీ కోసం తన రాజకీయ జీవితాన్నే పణంగా పెట్టానంటున్నారు బాలినేని శ్రీనివాసరెడ్డి. ఫిబ్రవరి 25లోపు సీఎం జగన్ (CM Jagan) చేతుల మీదుగా ఇళ్ల పట్టాల పంపిణీ ఉంటుందని పేర్కొన్నారు. అయితే, ఇళ్ల పట్టాల పంపిణీలో అవినీతి చేశారంటూ తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read: టికెట్లు అడిగే వారేలేరు .. బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తే ఊరుకోను: బుద్ధా వెంకన్న
ప్రతి పేదవాడి కల సొంతిల్లు అని ఆ కల నేరవెరుస్తాను హామీ ఇచ్చారు. అర్హుడు అయిన ప్రతివారికీ ఇళ్ళ స్థలాల పంపిణీ ఉంటుందన్నారు. ఇందులో ఎటువంటి రాజకీయం లేదని వ్యాఖ్యానించారు. ఈ బృహత్తర పథకాన్ని అడ్డుకునేందుకు కొంత మంది ప్రయత్నిస్తున్నారని చెప్పుకొచ్చారు. గతంలో టిడ్కొ ఇళ్ళ పరిస్థితి అందరికీ తెలుసిందేనని కామెంట్స్ చేశారు. బాలినేని చెబితే..చేస్తాడని ఒంగోలు ప్రజలందరికీ తెలుసన్నారు. తప్పుడు ఆరోపణలు మానుకొని, అభివృద్ధికి సహకరించాలని సూచించారు.
Also Read: ఓటమి భయంతోనే ఇలా చేస్తున్నారు: సీదిరి అప్పలరాజు