Balakrishna: జగన్ ఇందుకు సిద్ధంగా ఉన్నావా?: బాలకృష్ణ

రాష్ట్రంలో రాక్షస పరిపాలన నడుస్తోందని విమర్శలు గుప్పించారు హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ. అనంతపురం జిల్లా పెనుకొండలో టీడీపీ రా కదలిరా సభలో ఈ వ్యాఖ్యాలు చేశారు. వైసీపీ పాలనలో భూకబ్జాలు, ఇసుక మాఫియా పెరిగిపోతుందని మండిపడ్డారు.

Balakrishna: జగన్ ఇందుకు సిద్ధంగా ఉన్నావా?:  బాలకృష్ణ
New Update

MLA Balakrishna: అనంతపురం జిల్లా పెనుకొండలో టీడీపీ రా కదలిరా సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టాలీవుడ్ సీనియర్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ ప్రసంగించారు. టీడీపీకి కార్యకర్తలే బలం అని స్పష్టం చేశారు. తెలుగువారి ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పింది ఎన్టీఆర్ అని కొనియాడారు. ఆ తర్వాత ఎన్టీఆర్ స్ఫూర్తిని టీడీపీ అధినేత చంద్రబాబు మరింత ముందుకు తీసుకెళ్లారని కీర్తించారు. ఈ సందర్భంగానే సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాక్షస పరిపాలన నడుస్తోందని విమర్శలు గుప్పించారు బాలకృష్ణ. ఐదేళ్లు పూర్తవుతున్నా పోలవరం ప్రాజక్టు పూర్తి చేయలేదని వ్యాఖ్యానించారు. అప్పులు చేయకుండా ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితి లేదన్నారు. వైసీపీ పాలనలో భూకబ్జాలు, ఇసుక మాఫియా రెచ్చిపోతుందని మండిపడ్డారు. ప్రత్యేక హోదా తీసుకురాలేకపోయారని, కేంద్రం నుంచి నిధులు రాబట్టలేకపోయారని దుమ్మెత్తిపోశారు.

Also Read: బాలీవుడ్ ఖాన్స్ తో రామ్ చరణ్ నాటు..నాటు స్టెప్స్..అంబానీ వేడుకల్లో మాస్ రచ్చ!

రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం అంటూ పోస్టర్లు పెడుతున్నారని..అయితే జగన్ దేనికి దేనికి సిద్ధం అని ప్రశ్నించారు. సొంత బాబాయ్ ని చంపినవాళ్లను కాపాడుతూ చెల్లికి అన్యాయం చేశాడు.. దీనికి సమాధానం చెప్పడానికి సిద్ధమా అని నిలదీశారు. నిరుద్యోగులకు, అమరావతి రైతులకు, దళితులకు సమాధానం చెప్పడానికి జగన్ సిద్ధమా? దేనికి సిద్ధం నువ్వు జగన్ ? అని ప్రశ్నల వర్షం కురిపించారు. మాయలు, మోసాలకు మళ్లీ సిద్ధమా అని మండిపడ్డారు. జగన్ సిద్ధం అంటున్నావు.. ధర్మయుద్ధానికి మేం సిద్ధం అంటూ బాలకృష్ణ సమరశంఖం పూరించారు. వైసీపీ అరాచక పాలనను అంతం చేసేందుకు టీడీపీ-జనసేన కూటమి సిద్ధం అని వ్యాఖ్యానించారు. నిన్నూ, నీ పార్టీని పాతాళానికి తొక్కేయడానికి టీడీపీ, జనసేన శక్తులు ఒక్కటయ్యాయి అని కామెంట్స్ చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ మనతో కలిశాడు.. మాట కలిసింది, మనసు కలిసింది, ఇక మనల్ని అడ్డుకునే వారెవరూ లేరు అని ఎమ్మెల్యే బాలకృష్ణ ధీమా వ్యక్తం చేశారు.

#mla-balakrishna
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe