Akbaruddin Owaisi protem Speaker: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. అయితే, నేడు కొత్త శాసనసభ సభ్యులచే ప్రమాణ స్వీకారం చేయించాల్సి ఉన్నందుగా.. ముందుగా ప్రొటెం స్పీకర్‌ను ఎన్నుకున్నారు. ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీని ఎన్నుకున్నారు. ఈ నేపథ్యంలో రాజ్‌భవన్‌లో అక్బరుద్దీన్ చే అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా గవర్నర్ తమిళిసై ప్రమాణ స్వీకారం చేయించారు. అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన తరువాత కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో అక్బరుద్దీన్ ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. కాగా, ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు హాజరయ్యారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.
కాగా, స్పీకర్ ఎంపికకు సంబంధించి ఇవాళ నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు అసెంబ్లీ అధికారులు. ఇప్పటికే వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్‌ను స్పీకర్‌గా నిర్ణయించింది కాంగ్రెస్ అధిష్టానం. ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం అనంతరం స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. అప్పటి వరకు సభలో సీనియర్ నాయకుడు అయిన సభ్యుడు ప్రొటెం స్పీకర్‌గా వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలోనే అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్‌గా ఉండనున్నారు.
Also Read:
నేటి నుంచి ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఫ్రీగా ప్రయాణం
పచ్చి టమాటా తింటే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు.. ఎన్ని పోషకాలుంటాయో తెలుసా?