ఎమ్మెల్యేలు, మంత్రులకు కొత్త కార్లు కొనివ్వం.. మిజోరాం సీఎం సంచలన నిర్ణయం..

మిజోరాంలో సీఎం పదవి చేపట్టిన లాల్‌దుమహోమా సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా ఎమ్మెల్యేలు, మంత్రుల కోసం కొత్త కార్లు కొనుగోలు చేయకూడదని నిర్ణయించారు. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలు, మంత్రులు వాడిన వాహనాలనే కొనసాగించాలని సూచించారు.

ఎమ్మెల్యేలు, మంత్రులకు కొత్త కార్లు కొనివ్వం.. మిజోరాం సీఎం సంచలన నిర్ణయం..
New Update

మిజోరాంలో కొత్త ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు చేపట్టిన జోరం పీపుల్స్ మూవ్‌మెంట్‌ పార్టీ అధ్యక్షుడు లాల్‌దుహోమా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని ఎమ్మెల్యేలు, మంత్రుల కోసం కొత్త కార్లు కొనుగోలు చేయకూడదని నిర్ణయించారు. అయితే కార్లను కొనడం వల్ల ప్రజల సొమ్ము వృధా అవుతుందని లాల్‌దుహోమా అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేలు, మంత్రులు వాడిన వాహనాలనే కొనసాగించాలని సూచించారు. అలాగే గత ప్రభుత్వంలో మంత్రులు, ఎమ్మెల్యేలకు కల్పించిన సౌకర్యాలతో పోలిస్తే దాదాపు 50 శాతం సౌకర్యాలను తగ్గించుకుంటామని పేర్కొన్నారు. మిజోరాం సర్కార్ రైతుల సంక్షేమం కోసం పనిచేస్తుందని.. రాష్ట్రాన్ని అవినీతి రహితంగా మార్చేందుకు మంత్రులు, ఎమ్యెల్యేలు, పార్టీ కార్యకర్తలు, స్వచ్ఛంద సంస్థలు పనిచేయాలని పిలుపునిచ్చారు.

Also Read: రాష్ట్రం అప్పుల్లో ఉన్నా ఛాలెంజ్‌గా తీసుకున్నా: భట్టి విక్రమార్క

ZPM విధివిధానాలకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందిచాలని ముఖ్యమంత్రి లాల్‌దుహోమా ఆదేశించారు. అలాగే రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన అవినీతి కేసులపై సీబీఐతో విచారణ జరిపిస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వాలు ఆమోదం తెలిపిన కాంట్రాక్టు పనులు ఇప్పటికే మొదలైతే.. కాంట్రక్టర్లకు ఎలాంటి ఇబ్బంది ఉండదని.. యధావిధిగా తమ పనులు చేసుకోవచ్చని స్పష్టం చేశారు. కానీ ప్రాజెక్టుల్లో మాత్రం నాణ్యత లేకుంటే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు. అలాగే ప్రభుత్వ కార్యాలయాల్లో సిబ్బంది హాజరుశాతాన్ని పెంచే దిశగా చర్యలు తీసుకునేందుకు బయోమెట్రిక్ వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు.

Also Read: ఉరకలేస్తున్న యువ రక్తం.. చిన్న వయసులో అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేలు!

#mizoram-cm #telangana
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe