Mizoram CM: ఇందిరా గాంధీ సెక్యూరిటీ ఆఫీసర్.. మిజోరాం ముఖ్యమంత్రి! పాతికేళ్ల నిరీక్షణ ఫలించింది! 

అప్పుడు ఇందిరాగాంధీ సెక్యూరిటీ ఆఫీసర్.. ఇప్పుడు మిజోరాం ముఖ్యమంత్రి అవుతున్నారు. ఒకసారి ఎంపీగా.. మరోసారి ఎమ్మెల్యేగా రెండు సార్లు..ఆయనపై అనర్హత వేటు పడింది. లాల్దుహోమా సారధ్యం వహిస్తున్న పార్టీ ZPM మెజార్టీ సీట్లను సాధించడంతో అక్కడ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టనున్నారు 

New Update
Mizoram CM: ఇందిరా గాంధీ సెక్యూరిటీ ఆఫీసర్.. మిజోరాం ముఖ్యమంత్రి! పాతికేళ్ల నిరీక్షణ ఫలించింది! 

Mizoram CM: ఒకప్పుడు దేశ ప్రధాని ఇందిరాగాంధీకి రక్షణను అందించిన అధికారి.. ఎంపీగా అనర్హత వేటు పడిన మొదటి నేత.. నాలుగు ప్రయత్నాలలో అధికారం అందించలేకపోయాడని పార్టీ నుంచి గెంటివేతకు గురైన నాయకుడు.. రెండున్నర దశాబ్దాలుగా రాజకీయ పోరాటం చేస్తున్న యోధుడు.. ఇప్పుడు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆయనే జోరం పీపుల్స్ మూవ్‌మెంట్ అంటే జెడ్పీఎం పార్టీ అధినేత.. లాల్దుహోమా. ఐపీఎస్ అధికారిగా పెద్ద నేతలకు రక్షణ కల్పించిన విధుల నుంచి ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకు రక్షణ.. సంక్షేమం కల్పించే నాయకునిగా ఎదిగారు ఆయన. 

మిజోరం.. పూర్తిగా గిరిజనుల రాష్ట్రం. ఇక్కడ మూడు దశాబ్దాలుగా ఇద్దరు నేతలే ఆ రాష్ట్రంలో ముఖ్యమంత్రి(Mizoram CM) పదవి కోసం పోటీ పడుతూ వస్తున్నారు.. కాంగ్రెస్‌కు చెందిన లాల్ థన్‌హావ్లా - MNF నుంచి జోరమ్‌తంగా ఒకరు కాకపోతే మరొకరుగా అక్కడ ప్రజలకు నేతలుగా నిలుస్తూ వస్తున్నారు. వారిద్దరి మధ్యలో పాతికేళ్లుగా రాజకీయంగా ఎదుగుదల కోసం పోరాటం చేస్తూనే వచ్చారు 73 ఏళ్ల మాజీ ఐపీఎస్ అధికారి లాల్దుహోమా. 

మయన్మార్‌ సరిహద్దులోని చంపై జిల్లాలోని తువల్‌పుయ్‌ గ్రామంలో జన్మించారు లాల్డు హోమా. పేదరికం నుంచి బయటపడటానికి చదువును నమ్ముకున్నారు. 1972లో తన కార్యాలయంలో ప్రిన్సిపల్ అసిస్టెంట్‌గా ఉద్యోగం ఇప్పించిన అప్పటి కేంద్రపాలిత ప్రాంత తొలి సీఎం సి చుంగా దృష్టిని ఆకర్షించిన ఆయన ఉద్యోగం చేస్తూనే చదువు కొనసాగించారు. లాల్దుహోమా గౌహతి విశ్వవిద్యాలయంలో ఈవినింగ్ కోర్సులో చేరాడు.  డిస్టింక్షన్‌తో గ్రాడ్యుయేషన్‌ను పొందాడు ఐదు సంవత్సరాల తర్వాత సివిల్ సర్వీసెస్ పరీక్షలో క్లియర్ అయ్యాడు.

Also Read:  ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి.. ఇండియా కూటమి పరిస్థితి ఏమిటి?

Mizoram CM: గోవాలో IPS అధికారిగా విధులు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన  డ్రగ్ మాఫియాకు వ్యతిరేకంగా నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారు. ఆయన తన ప్రతిభతో అప్పటి PM ఇందిరా గాంధీ దృష్టిలో పడ్డారు. దీంతో ఆయనను  1982లో న్యూ ఢిల్లీకి బదిలీ చేసి, ఆ తర్వాత తన భద్రతా విభాగంలో చేర్చుకున్నారు.  ఈ క్రమంలోనే ఇందిర ఆదేశానుసారం, లాల్దుహోమా తిరుగుబాటు నాయకుడు లాల్‌డెంగా మిజో నేషనల్ ఫ్రంట్ (MNF)ని దారిలోకి  తీసుకురావడానికి సహాయపడింది. ఆ తరువాత 1984లో ఉద్యోగం మానేసి, కాంగ్రెస్‌లో చేరి మిజోరాం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు. ఎంపీగా అనర్హత వేటు పడడంతో  నాలుగేళ్ల తర్వాత పార్టీకి రాజీనామా చేశారు.

లాల్దుహోమా రాజకీయ ప్రస్థానంలో ముఖ్యమైన అడుగులు ఇవే.. 

  • లాల్దుహోమా 1984లో కాంగ్రెస్ టిక్కెట్‌పై మిజోరాం అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు, అయితే పీపుల్స్ కాన్ఫరెన్స్ పార్టీ నామినీ లాల్‌మింగ్‌తంగా చేతిలో 846 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
  • అదే సంవత్సరం లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
  • ZPM నాయకుడు, అప్పటి ముఖ్యమంత్రి లాల్ థన్హావ్లా - కొంతమంది క్యాబినెట్ మంత్రులపై కుట్ర పన్నారని ఆరోపణలు రావడంతో 1986లో రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి కూడా పక్కకు తప్పుకున్నారు. 
  • 1988లో కాంగ్రెస్‌ నుంచి వైదొలిగిన తర్వాత ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడిన తొలి ఎంపీగా లాల్దుహోమ నిలిచారు.
  • 2018 ఎన్నికలలో స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికైనప్పటికీ, ZPM పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొనడం ద్వారా ఆ పార్టీలోకి ఫిరాయించారని ఆరోపిస్తూ, 12 మంది మిజో నేషనల్ ఫ్రంట్ (MNF) శాసనసభ్యులు ఫిర్యాదులు దాఖలు చేయడంతో 2020లో మిజోరాం అసెంబ్లీ స్పీకర్ లాల్రిన్లియానా సైలో అతనిపై అనర్హత వేటు వేశారు.
  • మిజోరంలో ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హత వేటు పడిన మొదటి శాసనసభ్యుడు లాల్దుహోమా, అయితే 2021లో సెర్చిప్ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందారు.
  • కాంగ్రెస్‌తో పాటు, ఆయన ఒకప్పుడు ఎంఎన్‌ఎఫ్‌లో భాగంగా ఉన్నారు. అదే సమయంలో అయన  తన సొంత పార్టీ జోరామ్ నేషనలిస్ట్ పార్టీని స్థాపించాఋ. ZPM ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. 

Mizoram CM: నిజానికి మొదట్లో జోరామ్ పీపుల్స్ మూవ్‌మెంట్ పార్టీ ఆరు ప్రాంతీయ పార్టీల కూటమి. ఇందులో మిజోరం పీపుల్స్ కాన్ఫరెన్స్, జోరామ్ నేషనలిస్ట్ పార్టీ, జోరామ్ ఎక్సోడస్ మూవ్‌మెంట్, జోరామ్ డిసెంట్రలైజేషన్ ఫ్రంట్, జోరామ్ రిఫార్మేషన్ ఫ్రంట్-మిజోరం పీపుల్స్ పార్టీ ఉన్నాయి. 2018లో ఇదే కూటమితో జెడ్పీఎం ఎన్నికల్లో పోటీ చేసి ఎనిమిది స్థానాల్లో విజయం సాధించింది. దీని తరువాత, ఎన్నికల సంఘం (ECI) జూలై 2019లో పార్టీని అధికారికంగా నమోదు చేసింది. అతిపెద్ద వ్యవస్థాపక పార్టీ, మిజోరం పీపుల్స్ కాన్ఫరెన్స్, 2019లో కూటమి నుంచి వైదొలిగింది. తరువాత  మిగిలిన ఐదు పార్టీలు ZPM పేరుతో ఒకదానిలో విలీనం అయ్యాయి. 

Watch this interesting Video:

Advertisment
తాజా కథనాలు