Milk: పాలల్లో జాజికాయ కలిపి తాగితే ఆరోగ్యం పదిలం.. అనారోగ్యం దూరం! జాజికాయ కలిపిన పాలను తాగడం వల్ల ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా అనేక రోగాలకు చెక్ పెట్టవచ్చు. జాజికాయతో కలిపిన పాలు నాణ్యమైన నిద్రను అందిస్తాయి. గుండె, కాలేయం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పాలు క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. By Vijaya Nimma 02 Mar 2024 in Latest News In Telugu లైఫ్ స్టైల్ New Update షేర్ చేయండి Milk: జాజికాయతో కలిపిన పాలు తాగటం వలన మనస్సును ప్రశాంతంగా ఉంచడంతో పాటు నాణ్యమైన నిద్ర పడుతుందని నిపుణులు అంటున్నారు. దీంతో కీళ్ల నొప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. పాలు తాగడం ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరికి తెలిసిందే. కానీ కొన్నిసార్లు సాధారణ పాలు పోషకాలు కలిపిన పాలు తాగడం వల్ల అంత ప్రయోజనకరంగా ఉండదని వైద్యులు అంటున్నారు. అయితే.. జాజికాయ కలిపిన పాలను తాగితే ఆరోగ్యం మెరుగుపడటంతోపాటు అనేక రోగాలు శరీరానికి రావని నిపుణులు సూచిస్తున్నారు. జాజికాయ, తమలపాకులా కనిపించే వంటగది మసాలా, ఆయుర్వేదంలో ఆరోగ్యానికి ఒక వరం అని చెప్పబడింది. జాజికాయను పాలలో కలిపి తాగడం వల్ల శరీరానికి ఎంతో శక్తిని ఇస్తుంది. అనేక ప్రయోజనాలు ఉన్న జాజికాయ పాలు ఎలా తీసుకోవాలి ఇప్పుడు కొన్ని విషయాలు తెలుసుకుందాం. కీళ్లనొప్పులు దూరం: జాజికాయను విటమిన్ల నిధి అని పిలుస్తారు. ఇందులో చాలా ఐరన్, యాంటీ ఆక్సిడెంట్లు, ఫాస్పరస్, కాపర్, మెగ్నీషియం సహా అనేక రకాల పోషకాలు ఇందులో ఉన్నాయి. దీన్ని పాలలో కలిపి తాగితే కీళ్లనొప్పుల సమస్య నుంచి ఉపశమనం పొందడమే కాకుండా అనేక రకాల పొట్ట సంబంధిత సమస్యలను దూరం చేస్తుంది. గుండె ఆరోగ్యం: గుండె, కాలేయం ఆరోగ్యంగా ఉండాలంటే జాజికాయను పాలలో కలిపి తాగలని వైద్యులు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ జాజికాయతో చేసిన పాలు వలన క్యాన్సర్ నిరోధక గుణాలు ఎక్కువగ ఉన్నాయి. పాల వల్ల క్యాన్సర్ వంటి వ్యాధుల ముప్పు తగ్గుతుందని అంటున్నారు. కండరాల నొప్పి: రాత్రి నిద్ర పట్టలేని వారు, ఆయాసంతో ఉన్నవారు ముఖ్యంగా జాజికాయ కలిపిన పాలు తాగాలి. ఇది మనస్సుకు ప్రశాంతతనిస్తుంది. పూర్తి నిద్రను ఇస్తుంది. అలసటను తొలగించడంతో పాటు, జాజికాయతో కూడిన పాలు కీళ్ల, కండరాల నొప్పి నుంచి ఉపశమనాన్ని అందిస్తుంది. మనసుకు ఉపశమనం: జాజికాయలో యాంటీ స్ట్రెస్ గుణాలు ఉన్నాయని.. రాత్రిపూట పాలతో కలిపి తాగితే టెన్షన్, స్ట్రెస్, యాంగ్జయిటీ వంటి సమస్యలు దూరమై మనసుకు ఉపశమనం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: పిల్లలకు దగ్గు సిరప్ ఇచ్చేటప్పుడు ఈ పొరపాట్లు చేయకండి..చాలా ప్రమాదం గమనిక: ఈ కథనం ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. #health-tips #health-problems #milk #nutmeg #nutmeg-health-benefits మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి