Chandrayaan-3: 'ది బెస్ట్ క్లైమాక్స్‌కి కౌంట్‌డౌన్‌'.. సైంటిస్టుల కష్టాన్ని కళ్లకు కట్టే వీడియో!

చంద్రయాన్‌-3 ప్రయోగం సక్సెస్‌ అవ్వాలని 140 కోట్ల భారతీయులు అందరి దేవుళ్లకు ప్రార్థిస్తున్నారు. చంద్రయాన్‌-3 మేకింగ్‌ని కళ్లకు కట్టినట్టు చూపించే ఓ వీడియోని "PIB India" ట్వీట్‌ చేసింది. అటు చంద్రునిపై పరిస్థితి సరిగా లేకుంటే, ల్యాండింగ్ ఆగస్టు 27 వరకు వాయిదా వేసే అవకాశం ఉందని ఇస్రో ఇప్పటికే ప్రకటించింది.

Chandrayaan-3: 'ది బెస్ట్ క్లైమాక్స్‌కి కౌంట్‌డౌన్‌'.. సైంటిస్టుల కష్టాన్ని కళ్లకు కట్టే వీడియో!
New Update

Chandrayaan 3: ఆగస్టు 23, సాయంత్రం 6 గంటల 04 నిమిషాలు.. ఈ సమయం కోసం యావత్‌ దేశం ఎదురుచూస్తోంది. జాబిల్లీ ఒడిలోకి చంద్రయాన్‌-3 చేరే క్షణాలు ఎప్పుడు వస్తాయా అని అంతా వెయిట్ చేస్తున్నారు. చాలా మంది తమ షెడ్యూల్‌ని కూడా మార్చుకున్నారు. చంద్రయాన్‌-3 ప్రయోగం సక్సెస్‌ అవ్వాలని దేవుడికి ప్రార్థిస్తున్నారు. దేశ ప్రజలు మొత్తం ఒకే తాటికి పైకి రానున్న గడియలకు కౌంట్‌డౌన్‌ ఎప్పుడో మొదలవగా.. ఆఫీస్‌ల్లో, యూనివర్శిటీల్లో ఉద్యోగులకు, విద్యార్థులకు చంద్రయాన్‌-3 ప్రయోగం లైవ్‌ స్ట్రీమింగ్ ఏర్పాట్లు చేస్తున్నాయి సంస్థలు. చంద్రయాన్‌-2 ఫెయిల్యూర్‌ తర్వాత ఇస్రో సైంటిస్టులు వెనక్కి తగ్గలేదు.. బౌన్స్‌ బ్యాక్‌ అంటే ఏంటో చూపించేందుకు చంద్రయన్‌-3 కోసం కష్టపడ్డారు. దేశాన్ని గర్వించేలా చేసేందుకు సైంటిస్టుల పడ్డ కష్టం గురించి సోషల్‌మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇదే సమయంలో "PIB India" తన అధికారిక ట్విట్టర్‌ అకౌంట్‌లో ఓ వీడియోను షేర్ చేసింది.



మేకింగ్‌ ఆఫ్‌ చంద్రయాన్‌-3:

చంద్రయాన్‌-3 మేకింగ్‌ని కళ్లకు కట్టినట్టు చూపించే ఓ వీడియోని "PIB India" ట్వీట్‌ చేయగా.. అది కాస్త వైరల్‌గా మారింది. చంద్రయాన్‌-3 ప్రయోగం మొదటి నుంచి ఇప్పటివరుకు జరిగిన ప్రతి విషయాన్ని వీడియోలో పెట్టారు. 'కాస్మిక్‌ క్లైమాక్స్' అంటూ క్యాప్షన్ జోడించారు. ఈ ట్వీట్‌కి సంబంధించిన కామెంట్లు చూస్తే చంద్రయాన్‌-3 ప్రయోగం గురించి ప్రజలు ఎంత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారో అర్థం అవుతుంది. దేశభక్తి ఉప్పొంగుతోంది. 'శాస్త్రీయ అన్వేషణ పట్ల అచంచలమైన అంకితభావానికి నిదర్శనం. ఈ మిషన్ ఆవిష్కరణ, సంకల్పం, పురోగతి స్ఫూర్తిని కలిగి ఉంటుంది' అంటూ ఓ యూజర్‌ కామెంట్ చేశాడు.



మరోవైపు చంద్రయాన్-3 సేఫ్‌గా ల్యాండ్‌ అవ్వాలని 140 కోట్ల మంది ప్రజలు ప్రార్థనలు చేస్తున్నారు. చంద్రయాన్-3 రేపు సాయంత్రం 6:04 గంటలకు చంద్రునిపై ల్యాండ్ అవుతుంది. ల్యాండింగ్ ప్రక్రియ సాయంత్రం 5:45 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు అన్ని అనుకున్నట్టు జరగడంతో ఇస్రో సైంటిస్టులు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ఇటు ప్రజలు కూడా చంద్రయాన్‌-3 ప్రయోగం సక్సెస్‌ అవ్వాలని అందరి దేవుళ్లకు ప్రార్థిస్తున్నారు. ఇంతలా చంద్రయాన్‌ ప్రజల హృదయాల్లో పెనవేసుకుపోయింది.



ల్యాండింగ్ జరగకపోతే ఆగస్ట్ 27న ల్యాండింగ్:

చంద్రయాన్-3 విక్రమ్ ల్యాండర్ రేపు ల్యాండింగ్ చేయడానికి రెండు గంటల ముందు పరిస్థితిని సమీక్షిస్తుంది. ల్యాండర్ లోడులు, చంద్రునిపై పరిస్థితి సరిగా లేకుంటే, ల్యాండింగ్ ఆగస్టు 27 వరకు వాయిదా వేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 23న చంద్రుడి ఉపరితలంపై 30 కి.మీ ఎత్తు నుంచి ల్యాండర్ దిగేందుకు ప్రయత్నిస్తుందని, ఆ సమయంలో దాని వేగం సెకనుకు 1.68 కి.మీ ఉంటుందని ఇస్రో శాస్త్రవేత్త నీలేష్ దేశాయ్ తెలిపారు. ల్యాండింగ్ సమయంలో వేగం మరింత తగ్గుతుందని, అలా జరగకపోతే క్రాష్ ల్యాండింగ్ అయ్యే అవకాశం ఉంటుందన్నారు.

#chandrayaan-3-moon-landing #chandrayaan-3
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe