/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/lemon.jpg)
Cut Down 450 Lime Trees : అన్నమయ్య జిల్లా (Annamayya District) రాజంపేటలో రెండు సంవత్సరాల నిమ్మ తోట (Lime Tree) ను దుండగులు నరికేశారు. భూ వివాదమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. గత రాత్రి ఈ ఘటన జరిగింది. ఉదయం విషయం తెలుసుకున్న తోట యజమాని మంజుల తోటను పరిశీలించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
Also Read: ముచ్చుమర్రి గ్రామానికి హోం మంత్రి అనిత.. వారం గడుస్తున్న కనిపించని బాలిక డెడ్‌బాడీ..!
2015వ సంవత్సరంలో పట్టా భూమిని కొనుగోలు చేసిన మంజుల.. అప్పటి నుంచి పంట సాగు చేస్తోంది. పోలి గ్రామానికి చెందిన పోలి చంద్రారెడ్డితో మంజులకు భూ వివాదం ఉందని.. చంద్రా రెడ్డి తప్పుడు ధ్రువపత్రాలు సృష్టించి భూమి తనదే అంటున్నాడని బాధితురాలు మంజుల ఆవేదన వ్యక్తం చేస్తోంది. పోలి చంద్రా రెడ్డి, కుమారులపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఐదు ఏకరాల్లోని 450 నిమ్మ చెట్లను దుండగులు నరికేశారు. నరికిన చెట్లను పరిశీలించి కేసు దర్యాప్తు చేపట్టారు మన్నూరు రూరల్ పోలీసులు.