Ayodhya Ram Mandir : శ్రీరామనవమి రోజున రాములవారిని తాకే సూర్యకిరణాలు.. అయోధ్యలో అద్భుతం

అయోధ్య బాలరామయ్య కొలువవుతున్న భవ్య రామమందిరం బోలెడన్ని విశిష్టతలు కలిగి ఉంది. అందులో ఒకటి ప్రతీ ఏటా శ్రీరామనవమి రోజు సూర్య భగవానుడు స్వయంగా శ్రీరామునిని తన కిరణాలతో అభిషేకం చేయనున్నాడు. సూర్యవంశ తిలకుడు అయిన శ్రీరామునిని ఆ సూర్య భగవానుడు ఇలా పూజించనున్నాడు.

New Update
Ayodhya Ram Mandir : శ్రీరామనవమి రోజున రాములవారిని తాకే సూర్యకిరణాలు.. అయోధ్యలో అద్భుతం

Ayodhya Ram mandir : అయోధ్య(Ayodhya) లో నిర్మించిన రామమందిరానికి ప్పటికే ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఇలాంటి ఆలయం భారతదేశం(India) లోనే మొట్టమొదటిది అని చెబుతున్నారు. దీని గురించిన మరో ప్రత్యేకతను చెబుతున్నారు శ్రీరామ జన్మభూమి(Sri Rama Janmabhoomi) తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్(Champat Rai). రాముని పుట్టినరోజును, పెళ్ళిరోజును జరుపుకునే శ్రీరామ నవమి(Sri Rama Navami) రోజున ఈ అద్భుతం జరుగుతుందని అంటున్నారు. ఇక మీదట ప్రతీ ఏటా శ్రీరామనవమి రోజు సూర్య భగవానుడు స్వయంగా శ్రీరామునిని తన కిరణాలతో అభిషేకం చేయనున్నాడని చంపత్ రాయ్ తెలిపారు.

Also Read:మంత్రి అమర్నాథ్ పోటీపై వీడుతున్న ఉత్కంఠ..

శ్రీరామనవమి రోజునే..
ప్రముఖ అంతరిక్ష శాస్త్రవేత్తల సలహా మేరకు ప్రతీ సంవత్సరం చైత్రమాసం శుక్ల పక్షం 9 వ రోజన సూర్యకిరణాలు(Sun Rays) శ్రీరాముని విగ్రహం నుదుటిపై పడేలా అయోధ్య రాముడి విగ్రహాన్ని తీర్చిదిద్దారు. అందుకు తగ్గట్టే రాముడి విగ్రహం పొడవు, ఎత్తును రూపకల్పన చేశారు. విగ్రహానికి అనుగుణంగానే ఆలయ గోపురం నిర్మాణం కూడా ఉందని తెలిపారు. అందుకే ప్రతీ ఏటా శ్రీరామనవమి నాడు సరిగ్గా మధ్యాహ్నం 12 గంటలకు శ్రీరామునికి సూర్యుడు తన కిరణాలతో అభిషేకం చేస్తాడని చెప్పారు.

అయోధ్య రామాలయం(Ramalayam) కోసం ఎంపిక చేసిన విగ్రహం పొడవు 51 అంగుళాలు ఉంటుందని.. బరువు 1.5 టన్నులు ఉందని చెప్పారు చంపత్ రాయ్. ముదురు రంగు రాతితో చేసిన విగ్రహంలో విష్ణుమూర్తి దివ్యత్వం, రాజకుమారుడి తేజస్సు మాత్రమే కాకుండా ఐదేళ్ల బాలుని అమాయకత్వం కూడా కనిపిస్తుందని వివరించారు. జనవరి 18 వ తేదీన గర్భగుడిలోని సింహాసనంపై శ్రీరాముడిని ప్రతిష్ఠించనున్నట్లు చెప్పారు. ఈ విగ్రహాన్ని నీటితో, పాలతో స్నానం చేయించినా విగ్రహంపై ఎటువంటి తేడాలు రావని అన్నారు.

ఎంత రాత్రి అయినా గుడి తెరిచే ఉంటుంది...
అయోధ్యలో రాముడి ప్రాణ ప్రతిష్టాపన జరుగుతున్న ఈరోజున దేశవ్యాప్తంగా 5 లక్షల దేవాలయాల్లో వైభవంగా పూజలు జరుగుతాయని చెబుతోంది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్. దాంతో పాటూ ఆరోజు సాయంత్రం ప్రతి ఇంటి బయట కనీసం 5 దీపాలైనా వెలిగించాలని ట్రస్ట్‌ కోరింది. జనవరి 26 వ తేదీ తర్వాతే దర్శనం కోసం సామాన్యులు ఆలయానికి రావాలని సూచించారు. రాత్రి 12 గంటలైనా అందరూ దర్శనం చేసుకునేంత వరకు ఆలయ తలుపులు తెరిచి ఉంచుతామని ట్రస్టు ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్ తెలిపారు.

Also Read : శ్రీరాముడి కంటే ముందే అయోధ్యకు శ్రీమహావిష్ణువు..అయోధ్యలోని ఈ ప్రదేశాన్ని వైకుంఠధామం ఎందుకు పిలుస్తారో తెలుసా?

Advertisment
తాజా కథనాలు